Kia | దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా (Kia) అనుబంధ కియా ఇండియా (Kia India) కీలక మైలురాయి దాటింది. దేశీయంగా శరవేగంగా కార్లు విక్రయిస్తున్న సంస్థగా కియా రికార్డు నమోదు చేసింది. కార్ల ఉత్పత్తితోపాటు దేశీయంగా పది లక్షల కార్ల విక్రయంలోనూ సరికొత్త రికార్డు నమోదు చేసింది. కేవలం 59 నెలల్లోనే ఈ చారిత్రక మైలురాయిని దాటేసింది. కియా ఇండియా (Kia India) కార్లలో సెల్టోస్ (Seltos) 48 శాతం వాటా పొందితే, సోనెట్ (Sonet) 34, కరెన్స్ (Carens) 16 శాతం అమ్ముడు అవుతున్నాయి. కార్నివాల్ (Carnival), ఈవీ6 (EV6) కార్లు మిగతా వాటా భర్తీ చేస్తున్నాయి.
2019 ఆగస్టులో కియా ఇండియా (Kia India) దేశీయ మార్కెట్లో తొలుత సెల్టోస్ (Seltos) కారును ఆవిష్కరించింది. 2020 ఫిబ్రవరిలో ఆవిష్కరించిన కార్నివాల్ (Carnival) కారును ప్రస్తుతం మార్కెట్ నుంచి ఉపసంహరించింది. అదే ఏడాది సెప్టెంబర్‌లో సోనెట్ (Sonet) మార్కెట్లోకి ఎంటరైంది. 2022 ఫిబ్రవరిలో కరెన్స్ (Carens), 2022 జూన్‌లో ఈవీ6 (EV6) మార్కెట్లోకి ప్రవేశించాయి.
వివిధ కార్ల టాప్ ట్రిమ్స్ (Top Trims) సేల్స్‌తో తమకు 42 శాతం వాటా ఉందని కియా ఇండియా (Kia India) తెలిపింది. ప్రస్తుతం కియా ఇండియా (Kia India) మూడు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ (Automatic Transmissions) ఆప్షన్లు – ఐవీటీ (IVT), 6ఏటీ (6AT), 7డీసీటీ (7DCT) వేరియంట్లు మొత్తం 32 శాతం అమ్ముడు అవుతున్నాయి. 2020లో ఐఎంటీ (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ – Intelligent Manual Transmission) వేరియంట్‌తో సోనెట్ (Sonet) ఆవిష్కరించింది. దీంతో దేశీయ సేల్స్ లో 15 శాతం ఐఎంటీ వేరియంట్ కార్లు ఉన్నాయి. ఇక పెట్రోల్ ఇంజిన్ మోడ్ కార్లు 59 శాతం, డీజిల్ మోడ్ ఇంజిన్ కార్ల విక్రయాలు 41 శాతం ఉన్నాయి.
2019లో సెల్టోస్ (Seltos) తో భారత్ మార్కెట్లో మొదలైన కియా ఇండియా కార్ల సేల్స్ ఏయేటికాయేడు పెరుగుతూనే ఉన్నాయి. 2019లో 45,226 యూనిట్లు, 2020లో 1,40,505, 2021లో 1,81,583, 2022లో 2,54,556, 2023లో 2,55,000, 2024 తొలి ఏడు నెలల్లో 1.50 లక్షల కార్లు అమ్ముడయ్యాయి.
కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో సోనెట్, మిడ్ సైజ్ ఎస్ యూవీ సెగ్మెంట్లో సెల్టోస్, మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ)లో కరెన్స్ కార్లకు అత్యధిక గిరాకీ నెలకొంది. బహుళ ఫీచర్లతో కూడిన కార్లకు కియా ఇండియా పెట్టింది పేరు. మల్టీపుల్ పవర్ ట్రైన్ ఆప్షన్లలోనూ తక్కువ ధరకు కార్లను అందుబాటులోకి తెస్తోంది కియా ఇండియా. 100కి పైగా దేశాలకు 2.60 లక్షల పై చిలుకు కార్లను ఎగుమతి చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఏటా మూడు లక్షల కార్ల తయారీ సామర్థ్యం గల మాన్యుఫాక్చరింగ్ కెపాసిటీ యూనిట్ ఉంటుంది. దేశవ్యాప్తంగా 256 నగరాలు, పట్టణాల పరిధిలో 588 టచ్ పాయింట్లు ఉన్నాయి.