Nokia C300 & C110 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్.. అమెరికా మార్కెట్లోకి మరో రెండు ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లు నోకియా సీ300 (Nokia C300), నోకియా సీ110 (Nokia C110) ఆవిష్కరించింది. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 వర్షన్‌పై పని చేస్తాయి. రెండు ఫోన్లు పాలీ కార్బొనేట్ ఫ్రేమ్స్ అండ్ బ్యాక్స్‌తో వస్తున్నాయి. ఫ్లాంట్ డిస్ ప్లే విత్ హెచ్డీ + డిస్ ప్లేతో అందుబాటులోకి వస్తున్నాయి. నోకియా సీ300 వేరియంట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్, నోకియా సీ110 వేరియంట్ మీడియాటెక్ హెలియో పీ22 ఎస్వోసీ చిప్ సెట్ లతో మార్కెట్లోకి వచ్చాయి. ఇప్పటికే భారత్ మార్కెట్లో నోకియా ఈ ఫోన్లను నోకియా సీ32 (రూ.8,999), నోకియా సీ22 (రూ.7,999)లకు ఆవిష్కరించింది.
రెండు ఫోన్లు 3జీబీ రామ్ విత్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉన్నాయి. నోకియా సీ300 ఫోన్ ధర 139 డాలర్లు (దాదాపు రూ.11,400) విత్ బ్లూ కలర్ ఆప్షన్, నోకియా సీ110 ఫోన్ 99 డాలర్లు (సుమారు రూ.8,100) విత్ గ్రేకలర్ ఆప్షన్లలో లభిస్తాయి.
నోకియా సీ300 ఫోన్ 6.52-అంగుళాల హెచ్డీ + (1600×720 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే, నోకియా సీ110 6.3 అంగుళాల హెచ్డీ + (1560×720 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ తో వస్తున్నాయి. నోకియా సీ110 ఫోన్ మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. నోకియా సీ300 ఫోన్ 10 వాట్ల వైర్డ్ చార్జింగ్, నోకియా సీ110 ఫోన్ 3000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతోపాటు 5వాట్ల వైర్డ్ చార్జింగ్ కలిగి ఉంటాయి. యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్స్, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వీ 5.0 కనెక్టివిటీ కలిగి ఉంటాయి.
నోకియా సీ300 ట్రిపుల్ రేర్ కెమెరా విత్ 13-మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్, సెల్ఫీల కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కలిగి ఉంది. నోకియా సీ110 ఫోన్ 13-మెగా పిక్సెల్ రేర్ కెమెరా సెన్సర్, వన్ 5-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా సెన్సర్ ఉన్నాయి. నోకియా సీ300 ఫోన్ మీద సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఆప్షన్ కలిగి ఉంటుంది.