Nokia C22 | దేశీయ మార్కెట్లో నోకియా సీ22 ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?!
Nokia C22 | హెచ్ఎండీ గ్లోబల్ అనుబంధ నోకియా తన సీ సిరీస్ ఫోన్ ‘నోకియా సీ22’ ని ఈ నెల 11న మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Nokia C22 | ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ (HMD Global) ఆధ్వర్యంలోని నోకియా స్మార్ట్ ఫోన్ ‘సీ22’ ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించడానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న దేశీయ మార్కెట్లో తన `నోకియా సీ22 (Nokia C22)’ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించనున్నది హెచ్ఎండీ గ్లోబల్. నోకియా సీ32తోపాటు సెలెక్టెడ్ యూరప్ మార్కెట్లలో గత ఫిబ్రవరిలో ‘నోకియా సీ’ సిరీస్ ఫోన్లను ఆవిష్కరించారు.
నోకియా సీ22 (Nokia C22) 6.5-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్, 13-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తోపాటు డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) వర్షన్ మీద ఆధారపడి పని చేస్తుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. సింగిల్ చార్జింగ్‌తో మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటది. నోకియా సీ22లో వాటర్ రెసిస్టెన్స్ కోసం ‘ఐపీ52’ ఏర్పాటు చేశారు.
ఇప్పటికైతే నోకియా సీ22 (Nokia C22) ఫోన్ ధరలు వెల్లడించలేదు. చార్ కోల్, పర్పుల్, శాండ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. యూరప్ దేశాల మార్కెట్ల ధర ప్రకారం దాదాపు రూ.9,500 (109 యూరోలు) పలుకుతుందని భావిస్తున్నారు.
ఇవీ స్పెషిఫికేషన్స్
డ్యుయల్ సిమ్ (నానో) సౌకర్యంతోపాటు ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) వర్షన్ మీద పని చేస్తుంది. 6.5- అంగుళాల హెచ్ డీ + (720×1,600 పిక్సెల్స్) హెచ్డీ డిస్ ప్లేతో వస్తున్నది. ఓక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863 ప్రాసెసర్, 2జీబీ రామ్ కెపాసిటీతో వస్తున్నది.
నోకియా సీ22 ఫోన్ లో 13-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగా పిక్సెల్ రేర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 8-మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ 64 జీబీ రామ్ కాగా, దాన్ని మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 256 జీబీకి విస్తరించవచ్చు. రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్ కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ సపోర్ట్ ఫర్ 10 వాట్ల చార్జింగ్ ఫెసిలిటీతో వస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

