Nokia 105 Classic | ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘హెచ్ఎండీ గ్లోబల్’.. భారత్ మార్కెట్లో ‘నోకియా 105 క్లాసిక్ (Nokia 105 Classic)’ ఆవిష్కరించింది. యూపీఐ లావాదేవీలు తేలిగ్గా సాగేందుకు వీలుగా యూపీఐ అప్లికేషన్‌తో తయారు చేసింది. వైర్ లెస్ ఎఫ్ఎం రేడియో కనెక్టివిటీకి మద్దతుగా ఉంటుంది. ఏడాదిపాటు రీప్లేస్ మెంట్ వారంటీ ఉంటుంది. నాలుగు వేరియంట్లలో సింగిల్ సిమ్ అండ్ డబుల్ సిమ్ ఆప్షన్లతో చార్జర్/చార్జర్ లేకుండా వస్తున్నాయి.
రెండు కలర్స్- బ్లూ, చార్కోల్ రంగుల్లో నోకియా 105 క్లాసిక్ ఫోన్ వస్తుంది. నోకియా 105 క్లాసిక్ ఫోన్ రూ.999లకే లభిస్తుంది. స్పెషిఫికేషన్స్ వివరాలు వెల్లడించకున్నా 800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ప్యాకప్ ఉంటుందని తెలుస్తున్నది. ఇంతకుముందు నోకియా 105 (2023) ఫోన్ చార్కోల్, క్యాన్, రెడ్ కలర్ ఆప్షన్లలో రూ.1,299లకు, నోకియా 106 4జీ ఫోన్ రూ.2,199లకు అందుబాటులోకి తెచ్చింది.