హైదరాబాద్, మే 2(నమస్తే తెలంగాణ): దేశం లో అతిపెద్ద ఇనుప ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఉత్పత్తి, విక్రయాల్లో సరికొత్త రికార్డును నమోదుచేసింది. 2022 ఏప్రిల్‌తో పోల్చుకుంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్పత్తిలో 11.42 శాతం, విక్రయాల్లో 9.93 శాతం వృద్ధి నమోదైనట్లు ఎన్ఎండీసీ వర్గాలు తెలిపాయి. గతేడాది 3.15మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన సంస్థ..ఈ ఏడాది ఏప్రిల్‌లో 3.51 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసింది. విక్రయాలు గత ఏడాది 3.12 మిలియన్ టన్నులు కాగా, ఈ ఏడాది 3.43 మిలియన్ టన్నులకు చేరుకున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.