ముంబై, ఏప్రిల్ 10 : నిస్సాన్ మోటర్స్..ప్రస్తుతేడాది తొలి త్రైమాసికం(జనవరి-మార్చి మధ్యకాలంలో) దేశవ్యాప్తంగా 54 కొత్తగా టచ్పాయింట్లను ప్రారంభించింది. వీటిలో 3ఎస్(సేల్స్, సర్వీసెస్, స్పేర్‌పార్ట్స్) సేవలు కూడా అందిస్తున్నట్టు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వాత్సా తెలిపారు.
కస్టమర్లకు మరింత చేరువకావాలనే ఉద్దేశంతో టచ్పాయింట్లను వచ్చే మార్చి నాటికి 400కి పెంచుకోనున్నట్టు ఆయన ప్రకటించారు.