Nissan Magnite EZ Shift | నిస్సాన్ మోటార్ ఇండియా తన మాగ్నైట్ ఈజీ-షిఫ్ట్ (Magnite Easy-Shift) మోడల్ కారు ప్రారంభ ధరపై ఈ నెలాఖరు వరకే లభిస్తుందని తెలిపింది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మ్యాగ్నైట్ ఈజీ-షిఫ్ట్ కారు ధర పెరుగనున్నదని పేర్కొంది. కొనుగోలుదారులు రూ.11 వేల టోకెన్ సొమ్ము చెల్లించి మాగ్నైట్ ఈజీ-షిఫ్ట్ బుక్ చేసుకోవచ్చునని తెలిపింది. కారు ధర ఎంత పెరుగుతుందన్న సంగతి వెల్లడించలేదు.
నిస్సాన్ మోటార్ ఇండియా సబ్-4 మీటర్ ఎస్యూవీ నిస్సాన్ మ్యాగ్నైట్ ఈజీ-షిఫ్ట్ వేరియంట్ కారు గత నెలలో రూ.6.49 లక్షలకు (ఎక్స్ షోరూమ్) అందుబాటులో ఉంటుంది. నాలుగు వేరియంట్లలో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వర్షన్లతో లభిస్తుంది. ఇతర వేరియంట్ల ధరలు వెల్లడించలేదు. టాటా పంచ్, హ్యుండాయ్ ఎక్స్టర్తో మ్యాగ్నైట్ ఈజీ -షిఫ్ట్ పోటీ పడుతుంది. టాటా పంచ్ రూ.7.5 లక్షలు, హ్యుండాయ్ ఎక్స్టర్ ఏఎంటీ ధర రూ.8.10 లక్షలకు లభిస్తాయి.
మ్యాగ్నైట్ ఈజీషిఫ్ట్ కారు 1.0 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (71 బీహెచ్పీ విద్యుత్, 96 ఎన్ఎం టార్క్) వెలువరిస్తుంది. 5-స్పీడ్ ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తుంది. యాంటీ స్టాల్, క్విక్ డౌన్ ఫీచర్లు ఉంటాయి. ఈ ఫీచర్లతో తక్కువ స్పీడ్ ఉన్నప్పుడు యాక్సిలరేటర్ తొక్కకుండానే బ్రేక్ పెడల్ ప్రెస్ చేయొచ్చు. ఈ ఫీచర్ వెహికల్ డైనమిక్ కంట్రోల్ విత్ హిల్ స్టార్ట్ అసిస్ట్ ఫీచర్ స్టాండర్డ్‌గా వస్తున్నది. ఈజీ-షిఫ్ట్ లీటర్ పెట్రోల్ మీద 19.70 కి.మీ మైలేజీ ఇస్తుంది. మాన్యువల్ ట్రాన్స్ మిషన్ వేరియంట్ 19.35 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.
న్యూ బ్లూ డ్యుయల్ టోన్ కలర్ విత్ బ్లాక్ రూఫ్, షార్ప్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, 8- అంగుళాల టచ్ స్క్రీన్ సిస్టమ్, 7- అంగుళాల డిజిటల్ డ్రైవ్ డిస్ ప్లే, ఆటో ఏసీ విత్ రేర్ వెంట్స్, పుష్ బటన్ స్టార్ట్ అండ్ స్టాప్, అరౌండ్ వ్యూ మానిటర్, స్మార్ట్ కనెక్టివిటీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, వైర్ లెస్ చార్జింగ్, ఎయిర్ ఫ్యూరిఫయర్, అంబియెంట్ మూడ్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
సేఫ్టీ కోసం డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ చైల్డ్ యాంకర్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్పీ), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (టీసీఎస్), స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, హిల్ స్టార్ట్ అసిస్ట్ (హెచ్ఎస్ఏ), హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ (హెచ్‌బీఏ), 360 డిగ్రీ కెమెరా,, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), హిల్ స్టార్ట్ అసిస్ట్, ఏబీఎస్, ఈబీడీ తదితర ఫీచర్లు జత చేశారు.