హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : చిన్న తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారి కోసం జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంస్థ (నిమ్స్‌మే) ఈ నెల 18న రుణ మేళా నిర్వహించబోతున్నది. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలోని నిమ్స్‌మే క్యాంపస్‌లో ఈ రుణ మేళా నిర్వహిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ జనరల్ గ్లోరి స్వరూప తెలిపారు. రుణ మేళాలో భాగంగా గురువారం ఉద యం 9 గంటలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పా రు. ఇందులో రుణం పొందే ప్రక్రియ, అవసరమైన పత్రాలు, ప్రాజెక్టు నివేదిక తయారీ తదితర వాటి గురించి వివరిస్తామని తెలిపారు. వివరాలకు 040-23633244/ 218/261 నంబర్లను సంప్రదించాలని సూచించారు.