WhatsApp scam | యూఎస్ అధికారుల సందేశాల పేరిట సైబర్ మోసగాళ్ల సరికొత్త వాట్సాప్ ‘ఫ్రాడ్’.. ఎలాగంటే?!
WhatsApp scam | యూఎస్ అధికారులు.. ప్రముఖ కంపెనీల సీఈఓల పేరిట సైబర్ మోసగాళ్లు ఫేక్ వాట్సాప్ మెసేజ్లు పంపి అమాయకుల సొమ్ము కాజేస్తున్నారు. అటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
WhatsApp scam | ఇప్పుడంతా టెక్నాలజీ మయం.. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్.. క్యాబ్ బుకింగ్.. రైలు, విమానం.. బస్సు టికెట్ల బుకింగ్.. దాదాపు సకల పనులు పూర్తి చేసుకుంటాం.. టెక్నాలజీతోపాటు సైబర్ మోసగాళ్లు రోజుకో ఎత్తుగడతో అమాయకుల్ని.. ఒక్కోసారి ప్రముఖుల్నీ బురిడీ కొట్టిస్తున్నారు. అనునిత్యం వ్యూహాలు.. ఎత్తులు మారుస్తున్నారు. ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. సంబంధిత వ్యక్తుల ఫ్రెండ్స్ ను మనీ అడగడం వంటివి చేస్తున్నారు.
ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలని అంటూ హ్యాకర్లు.. సైబర్ మోసగాళ్లు వాట్సాప్ ద్వారా అలర్ట్ సందేశాలు పంపి.. మనీ దోచుకోవడం వంటి సైబర్ మోసాలు ఇటీవల బాగా వినిపిస్తున్నాయి. తాజాగా మరో తరహా మోసానికి తెర తీశారు. అమెరికా అధికారుల్లా, ఒకే సంస్థలో పని చేస్తున్న సహ ఉద్యోగులుగా, ప్రముఖ కంపెనీల సీఈఓలుగా యాక్ట్ చేస్తూ కస్టమర్లలో అవగాహన లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. వాట్సాప్ వేదికగా మన సొమ్ము స్వాహా చేయాలని ప్రయత్నిస్తున్నారు.
ఒక ప్రముఖ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు అమెరికా నంబర్ నుంచి పలు వాట్సాప్ ఫేక్ కాల్స్ వచ్చాయి. ‘ఈ సందేశం చూసిన తర్వాత ఫోన్ చేయండి. థాంక్స్’ అని మెసేజ్లు పంపుతున్నారు. అమెరికా అధికారుల భాషలోనే సందేశాలు పంపీ బురిడి కొట్టిస్తున్నారు. కనుక వాట్సాప్తో సహా ఇతర యాప్ల నుంచి వచ్చే ఫేక్ సందేశాల పట్ల అలర్ట్గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంతకుముందు లాటరీలు, రుణాలు, కొత్త కొలువుల అవకాశాల పేరుతో ఇంటర్నేషనల్ ఫోన్ నంబర్ల నుంచి వాట్సాప్ మెసేజ్ లు, కాల్స్ రావడంతో పలువురు ఆందోళనకు గురయ్యారు. అటువంటి కాల్స్ వస్తే ఒకటికి రెండు సార్లు ఆ నంబర్ చెక్ చేసుకోవడానికి 2ఎఫ్ఏ (టూ ఫాక్టర్ అథంటికేషన్) ఆప్షన్ ఎంచుకుంటే సరి.. గుర్తు తెలియని నంబర్ నుంచి.. అకౌంట్ నుంచి ఏ లింక్ వచ్చినా.. దాన్ని వెంటనే బ్లాక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు వాట్సాప్ అప్ డేట్ చేసుకోవాలని చెబుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

