Elon Musk on Parag Agrawal | ట్విట్టర్ న్యూ సీఈవోగా నియమితులైన పరాగ్ అగర్వాల్.. గ్లోబల్ టాప్-500 కంపెనీల సీఈవోల్లో అత్యంత చిన్నవాడని సమాచారం. మెటా (మాజీ ఫేస్బుక్) మార్క్ జుకర్‌బర్గ్, పరాగ్ చిన్నవారని బ్లూంబర్గ్ ఇండెక్స్ పేర్కొన్నా.. పరాగ్ చిన్నవాడరని తేలింది. టాప్-500 సీఈవోల్లో హాత్వే చీఫ్ వారెన్ బఫెట్ (900) అతి పెద్ద వయస్కుడని తెలుస్తున్నారు. ట్విట్టర్ సీఈవోగా నియామకంతో గ్లోబల్ టెక్ సంస్థలకు నియమితులైన ఇండియన్ల క్లబ్లో పరాగ్ అగర్వాల్ చేశారు.
అంతర్జాతీయంగా భారతీయుల ప్రతిభకు మంచి గుర్తింపు వస్తున్నది. ఐటీ రంగంలో మేటిగా ఎదిగింది భారత్. టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌కు కేంద్రంగా మారింది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్వర్క్స్ వంటి ప్రపంచస్థాయి టాప్ కంపెనీల సీఈఓలుగా భారత సంతతి వ్యక్తులు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
ఇండియన్స్ టాలెంట్‌ను ప్రశంసిస్తూ స్ట్రైప్ సీఈవో పాట్రిక్ కొలిసన్ ట్వీట్ చేశారు. భారతీయులు టెక్నాలజీ వరల్డ్‌లో రాణించడం ఆనందంగా ఉందని, వలసదారులకు అమెరికా కల్పిస్తున్న అవకాశాలకిది నిదర్శనం అని వ్యాఖ్యానించారు.పాట్రిక్ కొలిసన్ ట్వీట్‌పై టెస్లా సీఈవో ఎలన్మన్స్ రియాక్టయ్యారు.. ఇండియన్స్ టాలెంట్ నుంచి అమెరికా భారీగా లబ్ధి పొందుతున్నదని వ్యాఖ్యానించారు.