న్యూఢిల్లీ : భారత్ మార్కెట్లో ఈనెల 7న బ్రాండ్ న్యూ 125సీసీ స్కూటర్‌ను టీవీఎస్ మోటార్ లాంఛ్ చేయనుంది. హోండా యాక్టివా 125, సుజుకి యాక్సెస్ 125కి పోటీగా టీవీఎస్ జూపిటర్ 125ని కంపెనీ లాంఛ్ చేయనుంది. న్యూ టీవీఎస్ జూపిటర్ 125 న్యూ డిజైన్‌తో పాటు పలు అత్యాధునిక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. టీవీఎస్ జూపిటర్ 125కి సంబంధించిన ఫీచర్లతో కూడిన టీజర్‌ను లాంఛ్‌కు ముందు టీవీఎస్ తన సోషల్ మీడియా వేదికలపై విడుదల చేసింది.
ఈ టీజర్లో వెల్లడించిన వివరాల ఆధారంగా న్యూ జూపిటర్ 125 సీసీ ముందు భాగంలో భారీ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఉంటాయి. మిగిలిన ఫీచర్లను ప్రస్తుతం వెల్లడించకపోయినా 110 సీసీ వాహనానికి భిన్నంగా వినూత్న ఎలిమెంట్స్‌తో న్యూ 125 సీసీ స్కూటర్‌ను డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. హ్యాండిల్‌బార్‌లో వైబ్రేషన్స్ తగ్గించి స్మూత్ రైడ్ అందించేందుకు రబ్బర్‌ను వాడారు. ఇక సీటు కింద ఫుల్ సైజ్ హెల్మెట్‌తో పాటు ఇతర వస్తువులు పట్టేలా భారీ స్టోరేజ్ ఉంటుంది.