Toyota Camry | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ (Toyota) తన సెడాన్ మోడల్ కారు కమ్రీ (Toyota Camry) అప్ డేటెడ్ వర్షన్ ను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.48 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. సేఫ్టీతోపాటు అదనపు ఫీచర్లు, న్యూ ఇంటీరియర్ లే ఔట్, ఆల్ న్యూ డిజైన్లు ఉన్నాయి. గత మోడల్ కమ్రీ (Camry) కారు కంటే మైలేజీ ఎక్కువ కావడంతోపాటు ధర కూడా 1.83 లక్షలు ఎక్కువ. ఆసక్తిగల కస్టమర్లు తమకు సమీప డీలర్ వద్ద గానీ, టయోటా ఆన్ లైన్ లోగా ప్రీ బుకింగ్స్ నమోదు చేసుకోవాలని సూచించింది. తక్షణం కార్ల డెలివరీ ప్రారంభం కానున్నట్లు టయోటా కిర్లోస్కర్ తెలిపింది.
న్యూ టయోటా కమ్రీ 9-జనరేషన్ కారు టీఎన్జీఏ-కే ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్నది. లెక్సస్, అల్ ఫార్డ్, స్లెన్నా, వెంజా, లెక్సస్ ఈఎస్, లెక్సస్ ఆర్ఎక్స్ తదితర మోడల్ కార్ల స్ఫూర్తితో డిజైన్ చేశారు టయోటా న్యూ కమ్రీ కారు. ఫిఫ్ల్ జనరేషన్ హైబ్రీడ్ సిస్టమ్ (టీహెచ్ఎస్ -5)తోపాటు 2.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 230 హెచ్‌పీ పవర్ వెలువరించడంతోపాటు లీటర్ పెట్రోల్ మీద 25 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఈ-సీవీటీ గేర్ బాక్స్తోనూ వస్తుందీ కారు.
న్యూ టయోటా కమ్రీ 9-జనరేషన్ కారు ఫ్రంట్‌లో న్యూ హెడ్ ల్యాంప్ డిజైన్ ఇంటిగ్రేటెడ్ విత్ బ్లాక్ ఎలిమెంట్, హానీ కాంబ్ ప్యాటర్న్డ్ గ్రిల్లె, మోర్ స్లోప్డ్ రూఫ్ లైన్స్, రీడిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్, రేర్ బంపర్ ఉంటాయి. ఇంటీరియర్‌గా 7.0 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లోటింగ్ 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నైన్ స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్స్, 360 డిగ్రీ కెమెరా, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, హెచ్యూడీ డిస్ ప్లే, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, 10-వే పవర్డ్ ఫ్రంట్ సీట్స్ విత్ హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫంక్షన్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
టయోటా కమ్రీ 9-జనరేషన్ కారులో సేఫ్టీ సెన్స్ 3.0 అడాస్ సూట్, ప్రీ కొల్లిషన్ అసిస్ట్ విత్ పెడెస్ట్రియన్ డిటెక్షన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రొల్, లేన్ కీప్ అసిస్ట్, రోడ్ సైన్ రికగ్నిషన్, ఆటోమేటిక్ హై బీమ్, 9-ఎయిర్ బ్యాగ్స్ తోపాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్కింగ్ సెన్సర్లు, 360-డిగ్రీ కెమెరా ఉంటాయి. స్కోడా సూపర్బ్ మోడల్ కారుతోపాటు ఆడి ఏ4, మెర్సిడెజ్ సీ-క్లాస్, బీఎండబ్ల్యూ3 సిరీస్ గ్రాన్ లిమౌసిన్ కార్లతో టయోటా కమ్రీ 9- జనరేషన్ కారు పోటీ పడుతుంది.