Skoda Kylaq | భారత్‌లో కార్ల తయారీలో కీలకంగా వ్యవహరిస్తున్న స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియా (Skoda Auto Volkswagen India – SAVWIPL) త్వరలో భారత్ మార్కెట్లోకి ఎస్యూవీ కైలాక్ (Kylaq) తీసుకు రానున్నది. ఇందుకోసం మహారాష్ట్రలోని పుణెలోని చకాన్ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌లో కైలాక్ (Kylaq) కార్ల తయారీ ప్రారంభించింది. మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Breza), టాటా నెక్సాన్ (Tata Nexon), హ్యుండాయ్ వెన్యూ (Hyundai Venue), కియా సోనెట్ (Kia Sonet), మహీంద్రా ఎక్స్‌యూవీ 300 (Mahindra XUV300) కార్లకు కైలాక్ (Kylaq) గట్టి పోటీ ఇవ్వనున్నది. బుకింగ్స్ ప్రారంభించిన 10 రోజుల్లోనే 10 వేల బుకింగ్స్ నమోదయ్యాయి. ఈ నెల రెండో తేదీ నుంచి కైలాక్ (Kylaq) కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. వచ్చేనెల 27 నుంచి కార్ల డెలివరీ ప్రారంభం కానున్నది. తొలి 33,333 కస్టమర్లకు స్పెషల్ లాంచ్ ఆఫర్ కింద మూడేండ్ల స్టాండర్డ్ మెయింటెనెన్స్ ప్యాకేజీ (ఎస్ఎంపీ) కాంప్లిమెంటరీగా అందిస్తోంది స్కోడా.
స్కోడా కైలాక్ (Skoda Kylaq) నాలుగు వేరియంట్లు – క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్+, ప్రెస్టీజ్ ఆప్షన్లలో వస్తుంది. క్లాసిక్ 1.0 టీఎస్ఐ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ఇంజిన్ కారు రూ.7,89,000 (ఎక్స్ షోరూమ్), సిగ్నేచర్ టీఎస్ఐ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ఇంజిన్ కారు రూ.9,59.000 (ఎక్స్ షోరూమ్), సిగ్నేచర్ 1.0 టీఎస్ఐ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కారు రూ.10.59 లక్షలు (ఎక్స్ షోరూమ్), సిగ్నేచర్+ టీఎస్ఐ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ఇంజిన్ కారు రూ.11.40 లక్షలు (ఎక్స్ షోరూమ్), సిగ్నేచర్+ టీఎస్ఐ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ఇంజిన్ కారు రూ.12.40 లక్షలు (ఎక్స్ షోరూమ్), ప్రిస్టీజ్ టీఎస్ఐ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ఇంజిన్ కారు రూ.13.35 లక్షలు (ఎక్స్ షోరూమ్), ప్రిస్టీజ్ టీఎస్ఐ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ఇంజిన్ కారు రూ.14.40 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. తొలి 33,333 కస్టమర్లకు ఐదేండ్ల పాటు మెయింటెనెన్స్ కాస్ట్ రూ.0.24 ఫర్ కిలోమీటర్ పడుతుంది.
స్కోడా కైలాక్ 1.0 లీటర్ల టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 115 బీహెచ్పీ విద్యుత్, 178 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు కేవలం 10.5 సెకన్లలో 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. గరిష్టంగా గంటకు 188 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
స్కోడా కైలాక్ టచ్ బేస్డ్ క్లైమేట్ కంట్రోల్స్, 8- అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల సెంట్రల్ ఇన్ ఫోటైన్ మెంట్ సిస్టమ్ విత్ వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. సిక్స్ వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నది. ఇంకా సింగిల్ పేన్ సన్ రూఫ్, కీలెస్ ఎంట్రీ, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ చార్జింగ్ అండ్ ఇంటిగ్రేషన్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, క్రూయిజ్ కంట్రోల్ అండ్ స్టీరింగ్ మౌంటెడ్ పెడల్ షిఫ్టర్స్, సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.