AI | ఏఐపై కీలక వివరాలు వెల్లడించిన తాజా అధ్యయనం
AI : ఏఐ రాకతో మనుషులు చేసే పలు ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపధ్యంలో తాజా అధ్యయనం భిన్న కోణాన్ని ఆవిష్కరించింది.
AI : ఏఐ రాకతో మనుషులు చేసే పలు ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేస్తుందనే ఆందోళన వ్యక్తమవుతున్న నేపధ్యంలో తాజా అధ్యయనం భిన్న కోణాన్ని ఆవిష్కరించింది. ఏఐ ఉద్యోగులకు సహకరిస్తుందని, వాస్తవంగా ఇది వారి పని అనుభవాన్ని, సామర్ధ్యాన్ని పెంచుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. వర్క్ రిలేషన్షిప్ ఇండెక్స్ పేరిట హెచ్‌పీ చేపట్టిన ఈ తాజా అధ్యయనం ఆసక్తికర వివరాలు వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు పనిభారంతో సతమతమవుతూ విపరీతమైన ఒత్తిడికి గురువుతండగా ఏఐ వారి పనిభారాన్ని తగ్గిస్తూ, వారి టాస్క్‌లను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఒత్తిడిని నివారిస్తుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. పనిలో ఒత్తిళ్లను ఎదుర్కొనే క్రమంలో ఏఐ తమకు సాయపడుతుందని ఉద్యోగులు నమ్ముతున్నారు. భారత్ సహా 12 దేశాల్లోని 15,600 మందిని ఈ సర్వే పలుకరించి కీలక వివరాలు రాబట్టింది. ఎదుగుతున్న ఆర్ధిక వ్యవస్ధల్లో ఏఐ తమ ఉద్యోగాన్ని సరళతరం చేస్తుందని 76 శాతం మంది ప్రొఫెషనల్స్ వెల్లడించారు.
ఏఐ పట్ల చాలా ఆసక్తికరంగా ఉన్నామని 75 శాతం మంది వెల్లడించగా, పరిణితి చెందిన ఆర్ధిక వ్యవస్ధల్లో పనిచేసే ఉద్యోగులు 44 శాతం మంది ఈ తరహా అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ఉద్యోగుల సామర్ధ్యాలకు పదునుపెట్టి, ఉత్పాదక వాతావరణాన్ని సానుకూలంగా మార్చే సత్తా ఏఐకి ఉందని అధ్యయనం వెల్లడించింది. ఏఐ సామర్ధ్యాన్ని ఉద్యోగులకు వివరించేలా బిజినెస్ లీడర్స్ చొరవచూపాలని, ఏఐని అర్ధం చేసుకుని ఆమోదించాలని హెచ్‌పీ వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్, హెచ్‌పీ ఇంక్ ప్రెసిడెంట్ డేవ్ షల్ పేర్కొన్నారు.
Read More :
Bomb Threat | ఢిల్లీ కళాశాలకు బాంబు బెదిరింపులు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

