ముంబై, జూన్ 27: దేశీయంగా ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలోపెట్టుకొని మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్(ఏడీఏఎస్)తో తీర్చిదిద్దిన స్కార్పియో-ఎన్ మాడల్‌ను పరిచయం చేసింది. ప్రారంభ ధర రూ.20.29 లక్షలు.
జెర్మాడ్ వర్సిటీతో అపోలో మెడ్స్కిల్ జట్టు
హైదరాబాద్, జూన్ 27: ఉజ్బెకిస్తాన్‌కు చెందిన జెర్మాడ్ యూనివర్సిటీతో అపోలో మెడ్‌స్కిల్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించేవారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి ఈ ఒప్పందం దోహదం చేయనున్నదని కంపెనీ సీఈవో శ్రీనివాస రావు తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికిగాను ఈ ఒప్పందం అమలులోకి రానున్నట్లు, ఐదేండ్ల ఎంబీబీఎస్‌కు రూ.32 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 1.50 లక్షల ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, వీటికోసం ఏటా 12 లక్షల మంది విద్యార్థులు పోటీ పడుతున్నట్టు తెలిపారు.