UPI Payments | ఇప్పుడు రోజువారీ కిరాణ సరుకులు మొదలు.. సినిమా టికెట్లు, యుటిలిటీ బిల్లుల చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే సాగుతుంటాయి. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారిత మొబైల్ యాప్స్‌తో చెల్లింపులు క్షణాల్లో పూర్తవుతాయి. రోజురోజుకు పెరుగుతున్న యూపీఐ పేమెంట్స్ గత నెలలో సరికొత్త రికార్డు నెలకొల్పాయి.
గత నెలలో 1,344 కోట్ల లావాదేవీల్లో రూ.19.78 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. గత ఫిబ్రవరి యూపీఐ పేమెంట్స్ రూపంలో రూ.18.28 లక్షల కోట్లు లావాదేవీలు జరిగాయి. గతేడాది మార్చి లావాదేవీలతో పరిగణిస్తే లావాదేవీలు 55.35 శాతం పెరిగితే చెల్లింపులు 40.81 శాతం పుంజుకున్నాయి. 2023 మార్చిలో యూపీఐ ద్వారా రూ.14.05 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి.
గతేడాదిలో యూపీఐ ద్వారా రూ.199.95 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. 2022-23తో పోలిస్తే 43.68 శాతం పెరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.139.1 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. యూపీఐ పేమెంట్స్ 2016లో ప్రారంభం అయ్యాయి. మార్చి లావాదేవీలతో పోలిస్తే ఫిబ్రవరిలో స్వల్పంగా యూపీఐ చెల్లింపులు తగ్గాయి.