న్యూఢిల్లీ : న్యూ రేంజ్ రోవర్ స్పోర్ట్‌ను జాగ్వర్ ల్యాండ్‌రోవర్ ఆవిష్కరించింది. రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడ్రన్, స్లీక్ డిజైన్‌తో కస్టమర్లను మెప్పించేలా ముందుకొస్తోంది. రేంజ్ రోవర్ లుక్‌ను కొనసాగిస్తూనే లాంగర్ వీల్‌బేస్‌తో పాటు ఆకట్టుకునే ఫీచర్లను జోడిస్తూ లేటెస్ట్ స్పోర్ట్ ఎడిషన్‌ను ల్యాండ్‌రోవర్ సిద్ధం చేసింది.
ముందుభాగంలో స్లిమ్మెస్ట్ డిజిటల్ ఎల్ఈడీలను అమర్చగా రియర్ సైడ్ సర్ఫేస్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ ఆకట్టుకుంటాయి. పాత వెర్షన్‌తో పోలిస్తే 75ఎంఎం లాంగర్ వీల్‌బేస్‌తో స్పోర్టీ లుక్‌ను తీసుకొచ్చారు. ఇక క్యాబిన్ లేఅవుట్‌ను డ్రైవర్ ప్రాధాన్యతగా డిజైన్ చేశారు.
పివి ప్రొ సాఫ్ట్‌వేర్‌తో కూడిన 13.1 ఇంచ్ డిస్ప్లే, 13.7 ఇంచ్ డ్రైవర్ డిస్ప్లేతో న్యూ రేంజ్ రోవర్ స్పోర్ట్ ఇంటీరియర్స్ ఆకట్టుకుంటాయి. 29 స్పీకర్ మెరిడియన్ ఆడియో సిస్టం, వెంటిలేషన్, ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సహా పలు లేటెస్ట్ ఫీచర్లు జోడించారు. ఇక ఈ ఏడాది చివరినాటికి లేటెస్ట్ రేంజ్ రోవర్ స్పోర్ట్ భారత్ మార్కెట్‌కు రానుంది. ఇక న్యూ వెహికల్ రూ 1.6 కోట్లకు (ఎక్స్‌షోరూం) అందుబాటులో ఉంటుంది.