IRCTC New App | రైలులో ప్రయాణానికి తప్పనిసరిగా టికెట్ కావాల్సిందే. టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీకి ఉపయోగిస్తున్నారు. అయితే, రైల్వే ప్రయాణికులకు కోసం పలు రకాల యాప్స్‌ను ఉపయోగిస్తున్నది. అయితే, రైల్వే అన్నిరకాల సేవలు అందించేందుకు సరికొత్త సూపర్ యాప్‌ను కేంద్రం తీసుకువస్తుంది. ఇందులో అన్ని రైల్వేసేవలు అందుబాటులోకి రానున్నాయి. రైలు ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా సరికొత్తగా సూపర్ యాప్‌ని రూపొందిస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో ప్రకటించాయి. ఇందులోని అన్ని సేవలు ఈ యాప్‌లో ఉంటాయని చెప్పారు. రైలు టికెట్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ యాప్, వెబ్‌సైట్‌ని ఉపయోగిస్తున్నారు. అలాగే, రైలు స్టేటస్‌ని ట్రాక్ చేసేందుకు, పీఎన్ఆర్ స్టేటస్‌ని చూసేందుకు వివిధ రకాల యాప్‌ని ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే, రైల్వేశాఖకు సంబంధించి టికెట్స్ బుకింగ్, పీఎన్ఆర్ స్టేటస్, ట్రాకింగ్ స్టేటస్ కోసం యాప్స్‌ని ఉపయోగించడం ఇబ్బందికరంగా మారింది.
ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం సరికొత్త సూపర్ యాప్‌ని తీసుకురాబోతున్నది. ఇకపై ఈ యాప్‌లోనే టికెట్స్ బుకింగ్, పీఎన్ఆర్ స్టేటస్, ట్రెయిన్ ట్రాకింగ్ చేసేందుకు వీలుంటుంది. అయితే, రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నట్లు ఇటీవల రైల్వేశాఖ మంత్రి పేర్కొన్నారు. గత దశాబ్దల కాలంగా రైల్వేలను అత్యాధునికంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. అలాగే, సాంకేతికంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇక ప్లాట్‌ఫారమ్ నుంచి జనరల్ టికెట్ వరకు ఆన్లైన్ మోడ్‌లో కొనుగోలు చేసే వీలుంటుంది. అదే సమయంలో రైల్వే భద్రతపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారిస్తోంది. దీంతో రైలు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థను అమలు చేస్తున్నది. దీన్ని ‘కవచ్’గా పిలుస్తుంటారు. ప్రస్తుతం 10వేలు కవచ్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసింది రైల్వేశాఖ.