పుణె, నవంబర్ 22: దేశీయ మార్కెట్లోకి నయా పల్సర్ స్పోర్ట్స్ బైకును విడుదల చేసింది బజాజ్ ఆటో. 150 సీసీ సెగ్మెంట్‌ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా మంగళవారం పల్సల్ పీ 150 మోడల్‌ను ఆవిష్కరించింది. రెండు రకాల్లో లభించనున్న ఈ మోడల్ సింగిల్-డిస్క్, సింగిల్ సీట్ కలిగిన బైకు ధరను రూ.1.16 లక్షలుగాను, ట్విన్-డిస్క్, స్లిట్ సీట్ మోడల్ ధర రూ.1,19,757గా నిర్ణయించింది. 150 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైకులో యూఎస్బీ మొబైల్ చార్జింగ్ పోర్ట్, గేర్ ఇండికేటర్, సింగిల్ చానల్ ఏబీఎస్ బ్రేకింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ ఉన్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.