LIC Index Plus | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన కస్టమర్లకు లైఫ్ ఇన్సూరెన్స్‌తోపాటు పెట్టుబడి ఆప్షన్ కల్పిస్తూ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ (LIC Index Plus) అనే పేరుతో తెచ్చిన యూనిట్ లింక్డ్ జీవిత బీమా పాలసీలో 60 ఏండ్ల లోపు వారు చేరొచ్చు. ఇది నాన్ పార్టిసిపేటింగ్, రెగ్యులర్ ప్రీమియం, వ్యక్తిగత జీవిత బీమా ప్లాన్. ఈ పాలసీ ద్వారా సేవింగ్స్ ఆదా అవుతాయి.
50 ఏండ్ల లోపు వయస్సు గల వారు ఈ బీమా పాలసీ తీసుకుంటే వార్షిక ప్రీమియంపై ఏడు నుంచి పది రెట్లు, 51-60 ఏండ్ల లోపు వయస్సు ఉన్న వారు తీసుకునే పాలసీపై ఏడు రెట్లు బీమా కవరేజీ ఉంటుంది. ప్రీమియం చెల్లింపు పీరియడ్ 10-15 ఏండ్ల నుంచి 25 ఏండ్ల వరకూ కొనసాగించవచ్చు. నెలవారీ ప్రీమియం రూ.2500 చొప్పున వార్షిక ప్రీమియం రూ.30 వేలు పే చేయాల్సి ఉంటది. నెల వారీ, మూడు నెలలు, ఆరు నెలల ప్రీమియంల్లో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవచ్చు.
ఎన్ఎస్ఈ -100 ఇండెక్స్, ఎన్ఎస్ఈ-50 ఇండెక్సుల్లో ఎంపిక చేసిన సంస్థల షేర్లలో పెట్టుబడులు పెట్టొచ్చు. వాటిల్లో ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ /, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్ లో పెట్టుబడి ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఐదేండ్ల తర్వాత నిబంధనలకు అనుగుణంగా కొంత మొత్తం పాక్షికంగా విత్ డ్రా చేసుకునేందుకు పాలసీ అనుమతి ఇస్తుంది.