బుధవారం 03 మార్చి 2021
Business - Jan 27, 2021 , 16:20:33

అత్యాధునిక ఫీచర్లతో న్యూ జీప్‌ కంపాస్‌

అత్యాధునిక ఫీచర్లతో న్యూ జీప్‌ కంపాస్‌

న్యూఢిల్లీ : ప్రీమియం ఎస్‌యూవీ జీప్‌ కంపాస్‌ తాజా అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను ఎఫ్‌సీఏ ఇండియా బుధవారం లాంఛ్ చేసింది. న్యూ జీప్‌ కంపాస్‌ ఎక్స్‌ షోరూం ధర రూ .16.99 లక్షల నుంచి రూ . 28.29 లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది. కంపెనీ 80వ వార్షికోత్సవం సందర్భంగా రూ .22.96 లక్షల నుంచి రూ . 26.76 లక్షల ధరల శ్రేణిలో లిమిటెడ్‌ ఎడిషన్‌ను కూడా లాంఛ్‌ చేస్తున్నట్టు వెల్లడించింది.

ఫిబ్రవరి 2 నుంచి తమ డీలర్లు న్యూ జీప్‌ కంపాస్‌ వాహనానకి సంబంధించి కస్టమర్‌ టెస్ట్‌ డ్రైవ్‌లు, డెలివరీలను ప్రారంభిస్తారని కంపెనీ పేర్కొంది. న్యూ జీప్‌ కంపాస్‌లో అత్యాధునిక ఫీచర్లు, కస్టమర్లకు మెరుగైన సదుపాయాలతో పాటు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ప్రీమియం వెహికల్‌ను తీర్చిదిద్దామని ఎఫ్‌సీఏ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పార్థ దత్తా తెలిపారు. 

VIDEOS

logo