New Jawa 350 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ జావా యెజ్డీ మోటార్స్ సైకిల్స్.. భారత్ మార్కెట్లోకి న్యూ జావా 350 మోటారు సైకిల్ ఆవిష్కరించింది. దీని ధర రూ.2.15 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. జావా స్టాండర్డ్ అండ్ కమాండ్స్ మోటారు సైకిళ్లతో పోలిస్తే అడ్వాన్స్డ్ వెర్షన్ జావా న్యూ350 బైక్ దాదాపు రూ.12 వేలు ఎక్కువ. రివైజ్డ్ చాసిస్, లార్జర్ ఇంజిన్ ఆధారంగా రెట్రో థీమ్డ్ మోటారు సైకిల్ జావా న్యూ350 బైక్ ఆవిష్కరించింది.
రైడింగ్‌కు సౌకర్యవంతంగా థికర్ ఫోమ్‌తో సీట్ తయారు చేశారు. ఓల్డ్ మారూన్, బ్లాక్ ట్రిమ్స్తోపాటు మైస్టిక్యూ ఆరెంజ్ పెయింట్ ఆప్షన్‌తో న్యూ జావా350 బైక్ వస్తోంది. న్యూ డ్యుయల్ క్రెడిల్ చేసిస్పై రూపుదిద్దుకున్నదీ బైక్. 294సీసీ పవర్ ప్లాంట్ స్థానంలో లార్జర్ 334 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తున్నది. 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్ విత్ స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ తో ఇంజిన్ రూపుదిద్దుకున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 22 బీహెచ్పీ విద్యుత్, 28.2 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.