న్యూఢిల్లీ, జనవరి 9: ఔషధ రంగ దిగ్గజం ఎలీ లిల్లీ అండ్ కంపెనీ.. హైదరాబాద్‌లో ఓ నూతన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను తెచ్చే యోచనలో ఉన్నది. ఈ మేరకు గురువారం ఇక్కడ ప్రకటించింది. 1,000-1,500 మేర అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులనూ నియమించుకోవాలని చూస్తున్నది.
కాగా, లిల్లీ క్యాపబిలిటీ సెంటర్ ఇండియా (ఎల్‌సీసీఐ) హైదరాబాద్‌గా ఈ జీసీసీని పిలుస్తామని, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సొల్యూషన్స్ డెలివరీకి ఆరంభంలో ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్‌లపై దృష్టి పెడుతామని, దీంతో ప్రపంచవ్యాప్తంగా లిల్లీ సామర్థ్యాలను విస్తరిస్తామని ఓ ప్రకటనలో సంస్థ వెల్లడించింది. ఎలీ లిల్లీ నిర్ణయం.. హైదరాబాద్ ప్రతిష్ఠను మరింత పెంచగలదని రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.