BMW 5 Series | ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) తన న్యూ జనరేషన్ బీఎండబ్ల్యూ 5 సిరీస్ లాంగ్ వీల్ బేస్ (ఎల్‌డబ్ల్యూబీ) కార్ల ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది. వచ్చేనెలలో ఆల్ న్యూ బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ (All new BMW 5 Series LWB) కారును ఆవిష్కరించనున్నది. చెన్నై కేంద్రంగా దేశీయంగా తొలిసారి అసెంబ్లింగ్ చేస్తున్న కారు ఇది. ఇంతకుముందు గ్లోబల్ మార్కెట్లో లాంగ్ వీల్ బేస్ గైస్ ‘రైట్ హ్యాండ్ డ్రైవ్ (ఆర్‌హెచ్‌డీ) 5 సిరీస్ (Right Hand Drive 5 Series) కారును ఆవిష్కరించారు. దేశంలోని అన్ని బీఎండబ్ల్యూ డీలర్ల వద్ద, బీఎండబ్ల్యూ ఆన్ లైన్ స్టోర్లలోనూ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానున్న మెర్సిడెజ్ బెంజ్ ఈ క్లాస్ ఎల్‌డబ్ల్యూబీ (Mercedes-Benz E-Class LWB) కారు కంటే న్యూ బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ (BMW 5 Series LWB) కారు పొడవైందిగా ఉంటుంది. ఈ కారు 5175 ఎంఎం పొడవు, 1900 ఎంఎం వెడల్పు, 1520 ఎంఎం ఎత్తు ఉంటుంది.
స్టాండర్డ్ బీఎండబ్ల్యూ వీల్ బేస్ వర్షన్ మాదిరిగానే కనిపించే న్యూ జనరేషన్ బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ కారులో బోల్డ్ కిడ్నీ గ్రిల్లె, షార్ప్లీ స్టయిల్డ్ బంపర్ విత్ లార్జర్ ఎయిర్ ఇన్టేక్స్, న్యూ అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, స్లిమ్ రాప్ అరౌంట్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్‌తో ఈ కారు షార్ప్ అపియరెన్స్ కలిగి ఉంటుంది. 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ తోపాటు ప్రీమియర్ లుక్‌తో వస్తోంది.
న్యూ జనరేషన్ బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ కారు ఫ్రంట్ కర్వ్డ్ డిస్ ప్లే, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, లార్జర్ 14.9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ ప్లే ఉంటుంది. ఐడ్రైవ్ 8.5 ఆపరేటింగ్ సిస్టమ్ (iDrive 8.5 Operating System)తో పని చేస్తుంది. డాష్ బోర్డుపై ఇంటిగ్రేటెడ్ ఇంటరాక్షన్ బార్ ఆప్షనల్ గా జత చేస్తారు. ఫ్రంట్ సీట్ వెంటిలేషన్, 18 స్పీకర్ 655 వాట్ బౌవర్స్ అండ్ విల్కిన్స్ సౌండ్ సిస్టమ్, వైర్ లెస్ చార్జింగ్, టూ రేర్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్స్ తదితరాలు ఉన్నాయి. సేఫ్టీ కోసం అడాస్ షూట్ ఫీచర్లు జత చేశారు.
న్యూ బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో వస్తుంది. ఇంజిన్ పూర్తి వివరాలు వెల్లడించకున్నా 2.0 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజిన్ న్యూ 48 వోల్ట్ మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీకి మద్దతుగా ఉంటుందని చెబుతున్నారు.