Suzuki Motor Cycles | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా (Suzuki Motor Cycle India) తన సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125), సుజుకి బర్గ్మన్ స్ట్రీట్ (Suzuki Burgman Street) స్కూటర్లను స్పెషల్ ఫెస్టివ్ కలర్స్ ఆప్షన్లతో ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. హోండా యాక్టీవా 125, టీవీఎస్ జూపిటర్ 125, హీరో డెస్టినీ 125 స్కూటర్లకు ఈ రెండు స్కూటర్లు గట్టి పోటీ ఇస్తున్నాయి.
సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ మెటాలిక్ సొనోమా/ రెడ్ పెరల్ మిరేజ్ వైట్ డ్యుయల్ టోన్ కలర్ కాంబినేషన్, సుజుకి బర్గ్ మాన్ స్ట్రీట్ స్కూటర్ న్యూ మెటాలిక్ మ్యాట్టె బ్లాక్ నం.2 కలర్ ఆప్షన్లలో వస్తున్నాయి. స్పెషల్ ఫెస్టివ్ కలర్ ఆప్షన్లతో వస్తున్న సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ రూ.90,500 (ఎక్స్ షోరూమ్), సుజుకి బర్గ్ మాన్ స్ట్రీట్ స్కూటర్ రూ.98,299 (ఎక్స్ షోరూమ్) ధరలకు లభిస్తాయి.
సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ఆల్ అల్యూమినియం 4-స్ట్రోక్ సిలిండర్ 124సీసీ ఇంజిన్ తో వస్తోంది. ఈ ఇంజిన్ 8.7 పీఎస్ విద్యుత్ 10ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ స్కూటర్ బ్లూటూత్ ఎనేబుల్ మల్టీ ఫంక్షన్ డిజిటల్ కన్సోల్ విత్ సుజుకి రైడ్ కనెక్ట్, కంపాటిబుల్ బాత్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆప్షన్లు కలిగి ఉంటుంది. టర్న్ బై టర్న్ నేవిగేషన్, ఈటీఏ అప్ డేట్స్, కాల్, ఎస్ఎంఎస్, వాట్సాఫ్ అలర్ట్స్ అందుకోవచ్చు. ఈ స్కూటర్ ఇంజిన్ సుజుకి ఈజీ స్టార్ట్ సిస్టమ్ తో స్టార్ట్, స్టాఫ్ స్విచ్ కలిగి ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ పొజిషన్ లైట్, క్రోమ్ ఎక్స్ టర్న్ ఫ్లూయిడ్ లిడ్, సైడ్ స్టాండ్ ఇంటర్ లింక్ స్విచ్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ విత్ కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్స్ కలిగి ఉంటుంది.
సుజుకి యాక్సెస్ 125, సుజుకి బర్గ్ మాన్ స్ట్రీట్ స్కూటర్లలో ఒకే ఇంజిన్ వాడతారు. వీటిల్లో ఎల్ఈడీ హెడ్ లైట్, పొజిషన్ లాంప్, టెయిల్ లాంప్, బాడీ మౌంటెడ్ వైండ్ స్క్రీన్, బ్లూటూత్ ఎనేబుల్ మల్టీ ఫంక్షన్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, సుజుకి రైడ్ కనెక్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి. సుజుకి బర్గ్ మాన్ స్ట్రీట్ స్కూటర్ డ్యుయల్ టోన్ సీట్, టెలిస్కోపిక్ సస్పెన్షన్, 12 -అంగుళాల ఫ్రంట్ వీల్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ విత్ కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్, 21.5 లీటర్ అండర్ సీట్ స్టోరేజీ, ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ విత్ యూఎస్బీ సాకెట్, వన్ పుష్ సెంట్రల్ లాకింగ్, సేఫ్టీ షట్టర్ వంటి ఫీచర్లు జత చేశారు.