ముంబై, ఏప్రిల్ 22: జపాన్‌కు చెందిన టైర్ల తయారీ సంస్థ బ్రిడ్డ్స్టోన్.. మరో ఆరు నగరాలకు తన వ్యాపారాన్ని విస్తరించింది. హైదరాబాద్‌తోపాటు న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరులలో కొత్తగా సెలెక్ట్+ స్టోర్లను ప్రారంభించింది కూడా. జపాన్‌కు చెందిన బ్రిడ్జ్‌స్టోన్ గ్రూపు అనుబంధ సంస్థయైన బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా..తన తొలి స్టోర్‌ను గతేడాది ఫిబ్రవరిలో పుణెలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్టోర్లలో అన్ని రకాల టైర్లు, ఇందుకు సంబంధించిన సేవలు కూడా సంస్థ అందిస్తున్నది. టైరుకు సంబంధించిన సర్వీసులైన వీల్ అలైన్మెంట్, బాలెన్సింగ్, నైట్రోజెన్ ఫిల్లింగ్, రోటేషన్ వంటి సేవలు కూడా ఈ స్టోర్లలో పొందవచ్చును.