Bank New Rules | బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్. బ్యాంకు నిబంధనల్లో కీలక మార్పులు జరుగబోతున్నాయి. మారిన నిబంధనలు నేటి (నవంబర్ ఒకటి) నుంచి అమలులోకి వచ్చాయి. అమలులోకి రానున్నాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంక్ అకౌంట్ల నామినీల విషయంలో కీలక మార్పులు చేసింది. ఇకపై నుంచి నలుగురు నామినీలను ఎంపిక చేసుకునే వీలు కల్పించింది. దాంతో బ్యాంకింగ్ సిస్టమ్‌లో క్లెయిమ్ సెటిల్మెంట్ మరింత సులభతరం కానున్నది. ఇందు కోసం కేంద్రం బ్యాంకింగ్ చట్టాలు (సవరణ) యాక్ట్‌లో మార్పులు చేసింది.
బ్యాంకు నామినీలను నలుగురిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉండడంతో ఖాతాదారులకు ఉపయోగకరంగా ఉండనున్నది. వాస్తవానికి గతంలో ఈ పరిమితి ఇద్దరికి మాత్రమే అవకాశం ఉండేది. తాజాగా నలుగురు నామినీలు కలిగి ఉండడంతో వ్యక్తులు వారి నిధులు, ఆస్తులపై ఎక్కువ నియంత్రణను కలిగి ఉండనున్నారు. ఈ చర్య క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభంగా, క్రమబద్ధీకరించడానికి కేంద్రం ఈ మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు.. నామినీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా రికార్డు చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతాదారుల నిధులను రక్షించేందుకు, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో త్వరిత క్లెయిమ్ సెటిల్మెంట్ను నిర్ధారించేందుకు ఈ మార్పును అమలులోకి తీసుకువస్తున్నది. ఇది బ్యాంక్ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచుతుంది. స్పష్టమైన సమాచార నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తుంది.
బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం-2025 ప్రకారం.. బ్యాంకులు ప్రస్తుతం నలుగురు నామినీలను యాడ్ చేసేందుకు అనుమతి ఉంటుంది. వారి వివరాలు, ఈమెయల్ చిరునామా, ఫోన్ నంబర్లు కూడా అవసరమవుతాయి. ఈ నియమం బ్యాంకులలో త్వరిత, పారదర్శక క్లెయిమ్ పరిష్కారం లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళుతుంది. ఈ నియమాలను 2025 కి ముందు అమలు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. బ్యాంకు ఖాతాదారులు వారి కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, వారికి సంబంధించిన విశ్వసనీయ వ్యక్తులను నామినీలుగా ఎంచుకోవచ్చు. ఇది ఖాతాలో తలెత్తే ఏవైనా అనధికార క్లెయిమ్‌లు, వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు వీలు ఉంటుంది. బహుళ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నా.. లేదంటే వారి నిధులను రక్షించుకోవాలనుకునే ఖాతాదారులకు ఈ చర్య ప్రత్యేకంగా సహాయపడుతుంది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నియమాలు బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ పారదర్శకత, జవాబుదారీతనం, భద్రతను నిర్ధారించడమే లక్ష్యం. నలుగురు నామినీలను జోడించే సామర్థ్యం వారి ఆర్థిక ప్రణాళికను బలోపేతం చేస్తుంది. భవిష్యత్తులో వివాదాల సమస్యను తగ్గిస్తుంది.