Bajaj Chetak EV Scooter | ప్రముఖ టూ వీలర్స్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో (Bajaj Auto) దేశీయ మార్కెట్లో శుక్రవారం న్యూ వర్షన్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించనున్నది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తోపాటు పూర్తిగా రెట్రో డిజైన్‌తో వస్తున్న బ్లూ కలర్డ్ స్కూటర్ ఇంతకుముందు టీజ్ చేసింది. టర్న్ బై టర్న్ నేవిగేషన్ ఫీచర్, సెమీ సర్క్యులర్ డిస్ ప్లే, ట్రిప్, ఓడో మీటర్ తదితర ఫీచర్లు ఉంటాయని సంకేతాలిచ్చింది.
అర్బన్ మోడల్‌గా వస్తున్న 2024 బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ సింగిల్ చార్జింగ్‌తో 127 కి.మీ దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో లార్జర్ 3.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇంతకుముందు మార్కెట్లో ఉన్న బజాజ్ చేతక్ స్కూటర్ 2.88 కిలోవాట్ల బ్యాటరీ, సింగిల్ చార్జింగ్ తో 113 కి.మీ దూరం ప్రయాణ సామర్థ్యం ఉండేది. న్యూ బ్యాటరీ ఫుల్ చార్జింగ్ కావడానికి 4.30 గంటల సమయం పడుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుత మోడల్ బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ గంటకు 63 కి.మీ దూరం ప్రయాణిస్తే.. న్యూ చేతక్ బజాజ్ ఈవీ 73 కి.మీ దూరం ప్రయాణించగల కెపాసిటీ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఎల్సీడీ యూనిట్ స్థానే న్యూ టీఎఫ్టీ స్క్రీన్ ప్రవేశ పెడుతున్నారు. టర్న్ బై టర్న్ నేవిగేషన్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), రిమోట్ లాక్/ అన్ లాక్, బ్లూ టూత్ కనెక్టివిటీ తదితర ఫీచర్లు జత చేశారు. స్టోరేజీ కెపాసిటీ 18 లీటర్ల నుంచి 21 లీటర్లకు పెంచుతారు.