Neeraj Vyas | సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా బిజినెస్ హెడ్ పదవి నుంచి నీరజ్ వ్యాస్ తప్పుకోనున్నారు. ఆగస్టు నెలాఖరు నుంచి కంపెనీ నుంచి వైదొలగనున్నారు. దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ కెరిర్లో కొత్త ప్రయాణం ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సోని ఎంటర్టైన్మెంట్ టెలివిజన్, సోనీ సాబ్, పాల్, సోని మాక్స్ మూవీ కస్టర్స్‌కు హెడ్‌గా ఉన్న ఆయన ఉద్యోగం నుంచి తప్పుకోనున్నారు. ప్రస్తుతం ఆయన కొంతకాలం ఉద్యోగానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆయన స్థానంలో డిస్నీ స్టార్ నెట్వర్క్ నుంచి వచ్చిన గౌరవ్ బెనర్జీ ఈ నెలాఖరులో సోని సీఈవో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో కంపెనీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. మూడు దశాబ్దాల అద్భుతమైన కెరీర్ అనంతరం నీజర్ వ్యాస్ తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాడని తెలిపింది. పదవీకాలంలో మూడు సోని ఛానెల్స్, హిందీ మూవీ ఛానెల్స్ వ్యాపారం మెరుగుపరచడంలో నీజర్ కీలకపాత్ర పోషించారని కంపెనీ పేర్కొంది.
నీరజ్ వ్యాస్ సోని ఎంటర్టైన్మెంట్ టెలివిజన్‌లో సేల్స్ విభాగంలో ఎంట్రీ ఇచ్చారు. 2005లో ఛానెల్స్‌కు నేషనల్ సేల్స్ హెడ్‌గా నియామకమయ్యారు. ఐదేళ్లలో సోని మిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు. 2011లో సోని మ్యాక్స్ బాధ్యతలు అప్పగించగా.. 2017లో సోని సాబ్, సోనీ పాల్ బాధ్యతలు కూడా అప్పగించారు. గత సంవత్సరం సోనీ, జీ నెట్వర్క్ మధ్య విలీన చర్చల సమయంలో ఆయన సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ బాధ్యతలు అందుకున్నారు. ఇక పునవర్వ్యస్థీకరణలో భాగంగా సోని ఇటీవల డిస్నీ స్టార్ మాజీ చీఫ్ గౌరవ్ బెనర్జీని కంపెనీ సీఈవో నియమించింది. ఆయన నెలాఖరులో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా సోని వీడుతున్న సందర్భంలో నీరజ్ వ్యాస్ సోని పిక్చర్స్ నెట్‌వర్క్‌లో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు కంపెనీకి, తనకు కల్పించిన అవకాశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్త వ్యాపార ప్రయాణ ప్రారంభిస్తున్నానని.. తాను నేర్చుకున్న విషయాలు అనుభవాన్ని అందించగలవని ఆశిస్తున్నట్లు వ్యాస్ పేర్కొన్నారు.