Financial Frauds | ముంబై, జూన్ 14: గడిచిన మూడు సంవత్సరాల్లో 47 శాతం మంది భారతీయులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక మోసాల బారినపడ్డారని శుక్రవారం విడుదలైన ఓ సర్వే తెలియజేసింది. యూపీఐ, క్రెడిట్ కార్డ్ మోసాలే అధికంగా జరిగాయని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా 302 జిల్లాల నుంచి 23,000 మంది అభిప్రాయాలతో లోకల్‌సర్కిల్స్ ఈ సర్వేను చేపట్టింది.
వీరిలో సగం మందికిపైగా తమ క్రెడిట్ కార్డులపై దేశ, విదేశీ వ్యాపారులు/వెబ్సైట్లు అనధికారిక చార్జీలను వేసినట్టు చెప్పారని వెల్లడించింది. ఇక సర్వేలో పాల్గొన్నవారిలో 43 శాతం మంది తాము లేదా తమ కుటుంబ సభ్యులు క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో మోసపోయామని, 36 శాతం మంది యూపీఐ లావాదేవీల్లో నష్టపోయామన్నారు.