ITR Filing | డెడ్‌లైన్ నాటికి 5.89 కోట్ల ఐటీఆర్ దాఖలు!
ITR Filing | గత ఆర్థిక సంవత్సరానికి నిర్దిష్ఠ గడువుకల్లా 5.89 ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయని సీబీడీటీ శనివారం తెలిపింది.

గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో సుమారు 5.89 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత గడువు గత నెలాఖరు నాటికి కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో చివరి రోజు శుక్రవారం ఒక్కరోజే 46.11 లక్షలకు పైగా ఐటీఆర్‌లు దాఖలయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి గడువు 2021 జనవరి 10 నాటికి 5.95 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి. గతేడాది జనవరి 10న చివరి రోజు 31.05 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి.
గత ఆర్థిక సంవత్సరానికి దాఖలైన 5.89 కోట్ల ఐటీఆర్‌లలో ఐటీఆర్-1 పత్రాలు 2.92 కోట్లతో 49.6 శాతం, ఐటీఆర్-2 పత్రాలు 54.8 లక్షలు (9.3 శాతం), ఐటీఆర్-3 ఫామ్స్ 71.05 లక్షలు (12.1 శాతం), ఐటీఆర్-4 పత్రాలు 1.60 కోట్లు (27.2 శాతం), ఐటీఆర్-5 పత్రాలు 7.66 లక్షలు (1.3 శాతం), ఐటీఆర్ -6 పత్రాలు 2.58 లక్షలు, ఐటీఆర్-7 ఫామ్స్ 0.67 లక్షలు దాఖలయ్యాయి. 45.7 శాతానికి పైగా ఐటీఆర్‌లు ఆన్లైన్ ఐటీఆర్ ఫామ్‌లను ఉపయోగించి దాఖలు చేశారు. మిగతా ఐటీఆర్‌లను ఆఫ్‌లైన్ సాఫ్ట్వేర్ టూల్స్‌తో ఫైల్ చేశారని ఐటీ శాఖ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

