హైదరాబాద్, డిసెంబర్ 16: విద్యా రుణాలు అందించే ప్రముఖ ఎన్బీఎఫ్సీ ఆక్సిలో.. తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. గడిచిన మూడేండ్లలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లో 50 శాతం వృద్ధిని సాధించినట్లు, దీంతో ఇక్కడ మరిన్ని టచ్పాయింట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నదని కంపెనీ సీబీవో శ్వేత గురు తెలిపారు.
తెలుగు రాష్ర్టాల నుంచి విదేశాలకు వెళ్లిన విద్యార్థుల్లో 65 వేల మందికి రుణం ఇచ్చినట్లు, వీరు రూ.35-65 లక్షల వరకు లోన్ తీసుకొన్నట్లు చెప్పారు.