ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ఫిక్స్డ్ డిపాజిటర్లకు నజరానా ప్రకటించింది. అన్ని రకాల డిపాజిట్లపై వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్లు పెంచింది. రిజర్వు బ్యాంక్ రెపోరేటును పెంచిన పక్షం రోజుల తర్వాత పీఎన్బీ వడ్డీరేట్లను పెంచడం విశేషం. రూ.2 కోట్ల లోపు 10 ఏండ్ల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లకు ఈ వడ్డీరేట్ల పెంపు వర్తించనున్నదని పేర్కొంది. దీంతోపాటు 1111 రోజుల ఎఫ్డీ స్కీంను కూడా బ్యాంక్ ప్రకటించింది. ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్లు పెంచడంతో రేటు 5.50 శాతానికి చేరుకున్నది. అంతకుముందు ఈ రేటు 5.30 శాతంగా ఉన్నది.