హైదరాబాద్, ఆగస్టు 9: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.420.3 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది నాట్కో ఫార్మా లిమిటెడ్. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.320.4 కోట్లతో పోలిస్తే 31 శాతం పెరిగినట్లు వెల్లడించింది. అలాగే సంస్థ రికార్డు స్థాయి ఆదాయాన్ని ఆర్జించింది. ఏప్రిల్-జూన్ మధ్యకాలానికిగాను రూ.1,160.2 కోట్ల ఆదాయాన్ని గడించింది. ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటీవ్ కింద రూ.17 కోట్లు, లిటికేషన్ కేసు కోసం రూ.51 కోట్ల నిధులను వెచ్చించినట్లు తెలిపింది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.7 లేదా 350 శాతం మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.