Myntra | పండుగల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు పండుగ సేల్స్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. ఆ జాబితాలో మరో ఈ-కామర్స్ సంస్థ మైంత్రా (Myntra) జత కలిసింది. అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి మైంత్రా బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ ప్రారంభిస్తున్నది. ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్ అందిస్తుందని సమాచారం. ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందన్న విషయమై మైంత్రా వెల్లడించలేదు.
మైంత్రా కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు దారులకు 15 శాతం డిస్కౌంట్ అందిస్తున్న మైంత్రా.. కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్లు అందిస్తుంది. పేటీఎం, క్రెడ్ తదితర డిజిటల్ వాలెట్లపైనా ఆకర్షణీయ డిస్కౌంట్లు లభిస్తాయని సమాచారం.
ఈ బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్లో కర్టెన్ రైజర్ డీల్స్, గ్రాండ్ ఓపెనింగ్ అవర్స్, బ్రాండ్ మానియాతోపాటు టైం లిమిటెడ్ ప్రమోషన్ తదితర ఆకర్షణీయ ఆఫర్లు అందించనున్నట్లు మైంత్రా తెలిపింది. సంస్థ ‘ఇన్ సైడర్’ మెంబర్షిప్ ద్వారా చేసే ఆర్డర్లు.. ఫ్రీగా డెలివరీ చేయడంతోపాటు స్పెషల్ ఆఫర్లు అందిస్తామని తెలిపింది. భారీగా కొనుగోళ్లు జరిపే వారికి స్పెషల్ రివార్డులు అందిస్తామని వెల్లడించింది. బంగారం నాణాల నుంచి ట్రాలీలు, బ్యాక్ ప్యాక్ల వరకూ పలు బహుమతులు ఉంటాయని ప్రకటన చేసింది. కొత్త ఆవిష్కరణలపై భారీగా డిస్కౌంట్ అందిస్తుందని సమాచారం.