రిలయన్స్ చేతికి మెట్రో.. డీల్ విలువ రూ.4,000 కోట్లు!
: రిటైల్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దేశీయ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ మరో దిగ్గజ సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. డీ-మార్ట్, హైపర్‌మార్కెట్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి ఏకంగా మెట్రో క్యాష్ అండ్ క్యారీని హస్తగతం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: రిటైల్ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దేశీయ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ మరో దిగ్గజ సంస్థను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. డీ-మార్ట్, హైపర్‌మార్కెట్స్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి ఏకంగా మెట్రో క్యాష్ అండ్ క్యారీని హస్తగతం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. బిగ్‌బజార్ కొనుగోలు విషయంలో అమెజాన్ అడ్డుపుల్ల వేయడంతో దీని నుంచి వైదొలిగిన రిలయన్స్ రిటైల్ ఇక మెట్రోపై దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. మెట్రోను 500 మిలియన్ యూరోల(రూ.4 వేల కోట్లకు పైమాటే)కు కొనుగోలు చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా సంస్థకు 31 హోల్‌సేల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లతోపాటు భూములు, ఇతర ఆస్తులు ఉన్నాయి.
బీ2బీ సెగ్మెంట్‌పై ఫోకస్
రిటైల్ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న రిలయన్స్ రిటైల్..బిజినెస్2బిజినెస్(బీ2బీ) సెగ్మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. దీంట్లోభాగంగా జర్మనీకి చెందిన మెట్రో ఏజీఎస్ క్యాష్అండ్ క్యారీ బిజినెస్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య జరుగుతున్న చర్చలు ఈ నెల చివరి నాటికి కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. దేశీయ బీ2బీ రంగంలో ఇదే అతిపెద్ద ఒప్పందం కానున్నదని, ఇందుకు నియంత్రణ మండళ్లు అనుమతించాల్సి ఉంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన అత్యంత సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. కొనుగోలుదారులకు నూతన షాపింగ్ అనుభవం అందించాలనే ఉద్దేశంతో మెట్రోను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు, ముఖ్యంగా తక్కువ ధరకే వస్తువులను అందించాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
హైదరాబాద్‌లో నాలుగు స్టోర్లు
హైదరాబాద్‌లో సంస్థ నాలుగు స్టోర్లను నెలకొల్పింది. వ్యాపార విస్తరణలో భాగంగా దేశీయంగా తొలిసారిగా ఢిల్లీలో ప్రారంభించిన సంస్థ..దక్షిణాదిలో పాగా వేయడానికి ముందుగా బెంగళూరును ఎంచుకున్నది. ఆ తర్వాత హైదరాబాద్‌లో నలువైపులా నాలుగు స్టోర్లను నెలకొల్పింది. వీటితోపాటు గుజరాత్, పంజాబ్‌లలో ఒక్కో స్టోర్‌ను నెలకొల్పింది. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా 31 అవుట్లెట్లను కలిగివున్నది. మెట్రోను రిలయన్స్ కొనుగోలు చేస్తుండటంతో సంస్థలో పనిచేస్తున్న 4 వేల మంది సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

