హైదరాబాద్, ఆగస్టు 26: జెడ్ బ్లాక్ బ్రాండ్‌నేమ్‌తో 3-ఇన్-1 అగరబత్తీల్ని విక్రయిస్తున్న మైసూర్ డీప్ పెర్ఫ్యూమరీ హౌజ్ (ఎండీపీహెచ్) తాజాగా క్రికెట్ లెజండ్ ఎంఎస్ ధోనితో ఒక టీవీసీ ప్రచార కార్యక్రమాన్ని విడుదల చేసింది.

రోజువారీ ప్రార్థనల ప్రాముఖ్యతను ‘మన్ కీ శాంతి’ పేరిట దీనిని రూపొందించామని ఎండీపీహెచ్, జెడ్ బ్లాక్ డైరెక్టర్ అంకిత్ అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్ బ్లాక్‌కు ఆరేండ్లుగా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ధోని మరోసారి మా కాంపైన్లో పాలుపంచుకోవడం గౌరవంగా భావిస్తున్నామని కంపెనీ డైరెక్టర్ అన్షూల్ అగర్వాల్ వెల్లడించారు.