Motorola Moto G72 | మార్కెట్లోకి మోటరోలా.. మోటో జీ72.. ధరెంతంటే?!
Motorola Moto G72 | దేశీయ మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. మోటో జీ72 తెస్తున్నది. రూ.18,999 లకే ఈ ఫోన్ లభ్యం అవుతుంది.
Motorola Moto G72 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటారోలా ( Motorola ) మార్కెట్లోకి `మోటో జీ72 ( Moto G72 )` ఫోన్ తీసుకొస్తున్నది. ఫెస్టివ్ సీజన్లో 108 మెగా పిక్సెల్ రేర్ కెమరాతో వస్తున్న మోటో జీ72 ( Moto G72 ) ఫోన్ 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్నది. మీటెరైట్ గ్రే, పొలార్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ కొనుగోలు చేయొచ్చు. దీని ధర రూ.18,999.
33 వాట్ల చార్జర్‌తో వస్తున్న మోటో జీ 72 ఫోన్లో 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఏర్పాటు చేశారు. 33వాట్ల టైప్-సీ టర్బో పవర్ చార్జర్ అందిస్తారు. 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ + పోల్డ్ డిస్ప్లేతో వస్తున్న ఈఫోన్లో హై క్వాలిటీ వీడియోలు వీక్షించొచ్చు. ఈ మొబైల్ ఫోన్ మీడియా టెక్ హెలియో జీ99 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. గేమింగ్ కోసం బిలియన్ కలర్ 10-బిట్ 120 హెర్ట్జ్ పూల్డ్ డిస్ప్లే కూడా ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కేవలం రూ.14,999లకు లభ్యం అవుతుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.3000, డిస్కౌంట్ రూ.1000 అందిస్తున్నారు.
108 మెగా పిక్సెల్ (ఎంపీ) అల్ట్రా పిక్సెల్, 8 ఎంపీ అల్ట్రా వైడ్, డెప్త్, హెచ్డీ స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయడానికి వీలుగా 2 ఎంపీ మాక్రో ట్రిపుల్ రేర్ కెమెరా ఫీచర్ కూడా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 ఎంపీలతో వస్తుంది. పొట్రైట్ ఆప్షన్లో ఫొటో తీయొచ్చు. గ్రూప్ సెల్పీ, షాట్ ఆప్టిమిటైజేసన్, ఆటో స్మెల్ క్యాప్షర్, గెస్చర్ క్యాప్జర్, టైమర్ మోడ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
మొబైల్ అన్‌లాక్ చేయడానికి ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఆప్షన్ వస్తుంది. 3.5 ఎంఎం రెగ్యులర్ హెడ్‌ఫోన్ జాక్, 2 మైక్రో ఫోన్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా లభిస్తాయి. హైబ్రీడ్ సిమ్ కార్డ్ స్లాట్ ఉంటుంది. రెండు సిమ్ కార్డులు, ఒక మెమొరీ కార్డు ఒకేసారి వాడొచ్చు. మొబైల్ వాటర్ ప్రొటెక్షన్ కోసం ఐపీ52 వాటర్ రీపెల్లెంట్ డిజైన్ కూడా అందిస్తుంది మోటరోలా.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

