Motorola Edge 50 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా వచ్చేనెల మూడో తేదీన మోటరోలా ఎడ్జ్50 ప్రో ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. గతేడాది ఏప్రిల్లో ఆవిష్కరించిన మోటరోలా ఎడ్జ్40 ప్రో ఫోన్ కొనసాగింపుగా మోటరోలా ఎడ్జ్50 ప్రో వస్తోంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తుందని తెలుస్తున్నది. మూడు రంగులు – బ్లాక్, పర్పుల్, వైట్ విత్ స్టోన్ లైక్ ప్యాటర్న్ కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ 165 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల డిస్ ప్లే ఉంటుందని భావిస్తున్నారు. 12 జీబీ ర్యామ్ తోపాటు 125 వాట్ల వైర్డ్ చార్జింగ్ లేదా 50 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఎఫ్/1.4 అపెర్చర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్, 13 ఎంఎం వైడ్ యాంగిల్ కెమెరా, 73 ఎంఎం టెలిఫోటో షూటర్ విత్ 6x జూమ్ ఉంటుంది.