Motorola Edge 40 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) మార్కెట్లోకి తన ఎడ్జ్ 40 మోడల్ ఫోన్ న్యూ కలర్ ఆప్షన్ వివా మెజెంటా (Motorola Edge 40 Viva Magenta Colour) లో ఆవిష్కరించింది. గత నెలలో ఎక్లిప్స్ బ్లాక్ (Eclipse Black), లునార్ బ్లూ (Lunar Blue), నెబుల్లా గ్రీన్ (Nebula Green) రంగుల్లో భారత్ మార్కెట్లోకి వచ్చింది. మోటరోలా ఎడ్జ్ 40 (Motorola Edge 40) వివా మెజెంటా (Viva Magenta) కలర్ ఆప్షన్‌తో 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.29,999లకే అందుబాటులో ఉంది.
దీంతోపాటు మోటో జీ32 (Moto G32) మినరల్ గ్రే (Mineral Grey), సాటిన్ సిల్వర్ (Satin Silver)తోపాటు మరో రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఇక మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 8020 ఎస్వోసీ చిప్ సెట్ తో వచ్చింది. ఎంట్రీ లెవల్ మోటో జీ32 ఫోన్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది.
మోటరోలా ఎడ్జ్ 40 (Motorola Edge 40) ఫోన్ 6.55-అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2400 పిక్సెల్స్) పోలెడ్ డిస్ ప్లే విత్ 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో వచ్చింది. ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 8020 ఎస్వోసీ చిప్సెట్ విత్ 8జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ రామ్ అండ్ 2656 జీబీ ఆఫ్ యూఎస్ఎఫ్ 3.1 ఇన్ బిల్ట్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్స్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 32-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. మోటరోలా ఎడ్జ్ 40 (Motorola Edge 40) ఫోన్ 4400 ఎంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 68వాట్ల టర్బో పవర్ వైర్డ్ చార్జింగ్, 15 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
మోటో జీ32 (Moto G32) ఫోన్ న్యూ రోజ్ గోల్డ్, సాటిన్ మారూన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ వేదికపై 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.10,499, 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.11,999లకు లభిస్తుంది. గత మార్చిలో మినరల్ గ్రే, సాటిన్ సిల్వర్ రంగుల్లో మార్కెట్లోకి వచ్చేసిందీ ఫోన్.
మోటో జీ32 ఫోన్ (Moto G32) 6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ + 2400×1080 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే విత్ రీఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్ సెట్, ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ విత్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 16-మెగా పిక్సెల్ సెల్ఫీ సెన్సర్ కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ సపోర్ట్స్ 33 వాట్ల టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్‌తో వస్తుంది.