Moto G54 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. భారత్ మార్కెట్లో సెప్టెంబర్ ఆరో తేదీన తన మోటో జీ54 5జీ ఫోన్ ఆవిష్కరించనున్నది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్‌సెట్‌తోపాటు 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. రెండు కలర్ ఆప్షన్లలో రెండు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.14,999 నుంచి రూ.18,999 మధ్య పలుకుతుందని భావిస్తున్నారు. గతేడాది డిసెంబర్లో చైనా, జనవరిలో గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించారు.
బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో మోటో జీ54 5జీ వస్తుందని పేర్కొంటూ ఫ్లిప్‌కార్ట్ మైక్రోసైట్ తో టీజ్ చేసింది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తున్న ఈ ఫోన్ 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్ పై పని చేస్తుంది. అయితే ఆండ్రాయిడ్ 14 వర్షన్ తోపాటు మూడేండ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తుంది.
మోటో జీ54 5జీ ఫోన్ 6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్) డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా వస్తుంది. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది.
డోల్బీ ఆట్మోస్ తోపాటు స్టీరియో స్పీకర్లకు, మోటో స్పాషియల్ సౌండ్‌కి మద్దతుగా ఉంటుంది. సెక్యూరిటీ, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ఫ్రింట్ సెన్సర్ ఉంది. మింట్ గ్రీన్, మిడ్ నైట్ బ్లూ, పెరల్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, 5జీ సపోర్ట్, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ కలిగి ఉంటది.