Moto G34 5G | ప్రముఖ లాప్టాప్స్ అండ్ ట్యాబ్స్ తయారీ సంస్థ లెనెవో అనుబంధ మోటరోలా.. తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ మోటో జీ34 5జీ ఫోన్‌ను ఈ నెల తొమ్మిదో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది. మోటో జీ34 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరాతో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.5-అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. మోటో జీ34 5జీ ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. ఓక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తుంది.
మోటో జీ34 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999 పలుకుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం చైనా మార్కెట్లో మోటో జీ34 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.11,600 (999 చైనా యువాన్లు) పలుకుతుంది. ఈ ఫోన్ సీ బ్లూ, స్టార్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.
మోటో జీ34 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్ మీద పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 20:9 నిష్పత్తితో 6.5 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ ప్లేతో వస్తుంది. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తుంది. మరో 8 జీబీ ర్యామ్ వర్చువల్‌గా పెంచుకోవచ్చు.
మోటో జీ34 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది. డోల్బీ ఆట్మోస్ తోపాటు డ్యుయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది.