Moto G14 | ఒకటో తేదీన మార్కెట్లోకి మోటో జీ14 ఫోన్ ఆవిష్కరణ.. ఇవీ స్పెషిఫికేషన్స్ ..?!
Moto G14 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. భారత్ మార్కెట్లోకి మోటో జీ14 ఫోన్ ఆగస్టు ఒకటో తేదీన ఆవిష్కరించనున్నది.
Moto G14 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola).. భారత్ మార్కెట్లో బడ్జెట్ ఫోన్ల మార్కెట్‌ను విస్తరించనున్నది. వచ్చే వారం ‘మోటో జీ 14 (Moto G14)’ ఆవిష్కరించనున్నది మోటరోలా. మోటో జీ14 ఫోన్ భారత్‌లో ఎప్పుడు ఆవిష్కరిస్తారు.. దాని ధర ఎంత అన్నది ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్‌కార్ట్ టీజర్ రిలీజ్ చేసింది. ఫోన్లో ఫీచర్లు, కలర్ ఆప్షన్లు కూడా బయట పెట్టింది. రూ.9999లకే మోటో జీ 14 లభిస్తుందని సమాచారం.
ఈ ఏడాది ప్రారంభంలో ఆవిష్కరించిన మోటో జీ13 కొనసాగింపుగా భారత్ మార్కెట్లోకి మోటో జీ14 (Moto G14) వస్తున్నది. 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్‌తో వస్తున్నది. మోటో జీ14 ఫోన్ ఆగస్టు ఒకటో తేదీన మార్కెట్లో ఆవిష్కరిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రీ-ఆర్డర్స్ ప్రారంభం అవుతాయి. బ్లూ, గ్రే కలర్ ఆప్షన్లలో మోటో జీ14 (Moto G14) లభిస్తుంది. గ్లోస్సీ బాక్ విత్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ కలిగి ఉంటుంది.
మోటో జీ14 (Moto G14) ఫోన్ 6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తుంది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ616 ఎస్వోసీ చిప్ సెట్ విత్ 4జీబీ రామ్ విత్ 128 జీబీ ఆఫ్ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 వర్షన్ మీద పని చేస్తుందని భావిస్తున్నారు. ఆండ్రాయిడ్-14 అప్డేట్ కూడా అందిస్తుంది. మూడేండ్ల సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు.
మోటో జీ14 (Moto G14) ఫోన్ 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్‌లో సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 20 వాట్ల చార్జింగ్ కలిగి ఉంటుంది. 34 గంటల టాక్ టైమ్, 16 గంటల వీడియో స్ట్రీమింగ్కు బ్యాటరీ సపోర్ట్‌గా ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, డ్యుయల్ సిమ్ 4జీ కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

