మనలో చాలామందికి వీలున్నప్పుడల్లా బంగారు నగలను కొని ఇంట్లో పెట్టుకోవడం అలవాటు.
శుభకార్యాల్లో ధరించేందుకు.. అవసరం ఉన్నప్పుడు ఇట్టే నగదుగా మార్చుకునేందుకూ అనువుగా ఉండటం పుత్తడికున్న సౌకర్యం.
అయితే చేతిలో పైసలున్నాయని ఎంతంటే అంత కొని గోల్డ్‌ను ఇంట్లో ఉంచుకోలేమని మీకు తెలుసా. ఆదాయ పన్ను (ఐటీ) శాఖ నిబంధనలు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి మరి.
ఇంట్లో బంగారం ఎంత ఉంచుకోవచ్చో మీకు తెలుసా. అదేంటి మన సొమ్ముతో మనకు నచ్చిన నగల్ని మనింటికి తెచ్చుకోవడానికీ పరిమితులున్నాయా.. అనుకుంటున్నారా?. ఉన్నాయి.. ఇంట్లో ఎంత బంగారం పెట్టుకోవచ్చు అన్నదాని కోసం పలు రకాల పన్ను నిబంధనలున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణీత పరిమాణాలను పేర్కొంటూ చట్టాలను చేసింది. వాటి ప్రకారం ఇంట్లో బంగారం లేదా బంగారు ఆభరణాలను ఒక స్థాయి వరకే ఉంచుకోవాలి. అది దాటితే అనవసరపు ఇబ్బందులు తప్పవు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుసుకోవాల్సిన ఈ నిబంధనలు ఏం చెప్తున్నాయంటే..
బంగారం.. ఎప్పటికీ విలువైనదే. అందుకే ప్రతి ఒక్కరూ దాన్ని వీలైనంత ఎక్కువగా సొంతం చేసుకోవాలనే ప్రయత్నిస్తూ ఉంటారు. నగలు, నాణేలు, బిస్కట్ల రూపంలో భద్రపర్చుకుంటారు. అయితే ఇప్పుడు డిజిటల్ గోల్డ్ ట్రెండ్ నడుస్తున్నది. గోల్డ్ బాండ్లూ బాగానే ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ఈ లావాదేవీలన్నీ చట్టబద్ధంగానే నడుస్తాయి కాబ ట్టి గొడవే లేదు. అయితే దేశంలో ఇంకా చాలామంది భౌతిక బంగారాన్నే ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటున్నారు. కానీ పురుషులు, స్త్రీలు ఎవరైనాసరే భౌతికంగా బంగారం ఏ రూపంలో ఉన్నా ఇంతే తమవద్ద పెట్టుకోవాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చెప్తున్నది.
సీబీడీటీ ఏం చెప్తున్నది?
దేశంలో ఎవరెంత బంగారాన్ని తమవద్ద ఉంచుకోవచ్చన్న దానిపై సీబీడీటీ కొన్ని నిబంధనల్ని పెట్టింది. వీటి ప్రకారం సదరు పరిమితి దాటితే ఆ మొత్తం బంగారానికి సంబంధించిన లెక్కల్ని ఐటీ అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. అలాగే సోదాలు, తనిఖీల
సమయంలో నిబంధనల మేరకు ఉన్న బంగారం లేదా బంగారు ఆభరణాలను అధికారులెవరూ జప్తుగానీ, స్వాధీనంగానీ చేసుకోవద్దని కూడా సీబీడీటీ రూల్స్ స్పష్టం చేస్తున్నాయి. అంతేగాక దొరికిన బంగారం ఎంత ఉన్నా.. దానికి చట్టబద్ధత ఉంటే (పన్నులు చెల్లించి కొన్న రుజువులు ఉంటే) కూడా వాటికి జోలికి పోరాదు.
ఎవరి దగ్గర ఎంతెంత? అంటే..
నిపుణులు ఏమంటున్నారు?
బంగారం లేదా బంగారు ఆభరణాలను కొంటున్నప్పుడు దానికి సంబంధించిన బిల్లును అంతా తప్పక తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దాన్ని భద్రంగా దాచుకోవాలని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే బంగారు నగలను ఎవరైనా ఎంతైనా తమవద్ద ఉంచుకోవచ్చని సీబీడీటీ కూడా చెప్తున్నట్టు వారు గుర్తుచేస్తున్నారు. కానీ ఇందుకు బిల్లులు కచ్చితంగా ఉండాలంటున్నట్టు వివరిస్తున్నారు. కనుక బంగారం ఎప్పుడు, ఎక్కడ, ఎవరి దగ్గర కొన్నా దాని బిల్లులు ఉంటే నిశ్చింతగా ఉండవచ్చు. ధర తగ్గతుందని బిల్లును వద్దనుకుంటే కొన్న బంగారం ఎప్పటికైనా మీకు చిక్కుల్ని తెచ్చిపెట్టకపోదని హెచ్చరిస్తున్నారు.
పన్ను నిబంధనలు ఏమిటి?