Union Minister Rammohan Naidu | హెలికాప్టర్ పరిశ్రమలోకి మరింత మంది మహిళా పైలట్లు వస్తారని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానాశ్రయాలను నిర్మించలేని, విమానాలు నడపలేని ప్రాంతాలను అనుసంధానించడంలో హెలికాప్టర్లు కీలకం అవుతాయన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే శరవేగంగా భారత పౌర విమానయాన రంగం అభివృద్ధి చెందుతున్నదన్నారు. దేశీయంగా హెలికాప్టర్ పరిశ్రమను ప్రోత్సహించడానికి పలు చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పైలట్లు సగటున ఐదు శాతం ఉంటే, భారత్ లో 15 శాతం మంది మహిళా పైలట్లు ఉన్నారన్నారు. పౌర విమానయాన రంగంలో మహిళా సాధికారతను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విమానాశ్రయం నిర్మించలేని, వాణిజ్య విమాన సర్వీసులు నడుపలేని ప్రాంతాలను అనుసంధానించడానికి హెలికాప్టర్ పరిశ్రమ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.