కొత్త కార్ల సందడి.. వచ్చే నెలలో విడుదలకానున్న ఐదు మాడళ్లు
దేశీయ ఆటోమొబైల్ రంగంలోకి మరిన్ని నూతన కార్లు రావడానికి సిద్ధమవుతున్నాయి. వచ్చే నెలలో కొత్తగా ఐదు మాడళ్లను విడుదల చేయబోతున్నట్టు దేశీయ, అంతర్జాతీయ వాహన సంస్థలు ప్రకటించాయి.
న్యూఢిల్లీ, మార్చి 28: దేశీయ ఆటోమొబైల్ రంగంలోకి మరిన్ని నూతన కార్లు రావడానికి సిద్ధమవుతున్నాయి. వచ్చే నెలలో కొత్తగా ఐదు మాడళ్లను విడుదల చేయబోతున్నట్టు దేశీయ, అంతర్జాతీయ వాహన సంస్థలు ప్రకటించాయి. వీటిలో ఫోక్స్‌వ్యాగన్, ఎంజీ, మెర్సిడెజ్ బెంజ్, టయోటా, నిస్సాన్‌లు ఉన్నాయి. ఒకవైపు ధరలు పెంచుతున్నప్పటికీ, మరోవైపు, నూతన వాహనాలను విడుదల చేయబోతున్నాయి. వీటిలో ఇప్పటికే పలు మాడళ్లను ప్రదర్శించాయి కూడా. వీటి వివరాలు..
ఫోక్స్‌వ్యాగన్ టైగూన్
ఫోక్స్‌వ్యాగన్ మరో నయా మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేయబోతున్నది. ఐదేండ్ల తర్వాత టైగూన్ నయా మాడల్‌ను విడుదల చేస్తున్నది. 2021లో ఈ ఎస్‌యూవీని విడుదల చేసిన సంస్థ..ప్రస్తుతం ఈ మాడల్‌ను ఆధునీకరించి, ముఖ్యంగా కొనుగోలుదారులు కోరుకుంటున్న విధంగా పలు మార్పులు చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన ఈ మాడల్‌లో ఎనిమిది గేర్లు ఉండనున్నాయి.
బెంజ్ సీఎల్ఏ మాడల్
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెజ్-బెంజ్ మరో ఎలక్ట్రిక్ మాడల్‌ను తీసుకురాబోతున్నది. వచ్చే నెలలో సీఎల్ఏ ఎంట్రీ-లెవల్ ఈవీ సెడాన్‌ను ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించింది. సింగిల్ చార్జింగ్‌తో 792 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మాడల్‌లో 14 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, గ్లాస్ రూఫ్ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది. ఈ కారు ధర రూ.55 లక్షల నుంచి రూ.59 లక్షల మధ్యలో ఉంటుందని అంచనా.
టయోటా అర్బన్ క్రూజర్
టయోటా కంపెనీ మరో ఈవీ మాడల్ అర్బన్ క్రూజర్‌ను ప్రవేశపెట్టబోతున్నది. 40 కిలోవాట్లు, 61 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో లభించనున్న ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 543 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. బ్యాటరీ-యాస్-ఏ-సర్వీసెస్(బాస్) ప్రొగ్రాం పద్దతిన ఈ మాడల్‌ను ప్రవేశపెడుతున్నది.
నిస్సాన్ టెక్టాన్
నిస్సాన్ మరో ఎస్‌యూవీని విడుదల చేయబోతున్నది. రెనో డస్టర్‌కు ప్రత్నామ్నాయంగా టెక్టాన్‌ను తీసుకొస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

