గ్లోబల్ ఫైనాన్షియల్ కేంద్రంగా హైదరాబాద్
ఫిన్‌టెక్, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకు హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు.
- ‘ఆర్థా ఫిన్‌టెక్’ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
- ‘ఆర్థా ఫిన్‌టెక్’ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఫిన్‌టెక్, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకు హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరొన్నారు. శనివారం హైటెక్ సిటీలో సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్థాఫిన్టెక్ హైదరాబాద్ కార్యాలయాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రపంచ స్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్‌లో పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)కి ప్రోత్సాహం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. ఐటీ/ఐటీఈఎస్ రంగంలో హైదరాబాద్ సాధించిన అంతర్జాతీయ గుర్తింపును ఫిన్‌టెక్, డిజిటల్ బ్యాంకింగ్, గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకూ విస్తరించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని చెప్పారు. గ్లోబల్ కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌కు విస్తరించేలా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ ఎకో సిస్టంను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

