Android Users-CERT-In | ఆండ్రాయిడ్ ఫోన్ల యూజర్లకు సెక్యూరిటీ ముప్పు.. బీ అలర్ట్ అంటూ సెర్ట్-ఇన్ వార్నింగ్..!
Android Users-CERT-In | స్మార్ట్ ఫోన్లలో వాడుతున్న ఆండ్రాయిడ్ వర్షన్లలో లోపాలతో వాటి యూజర్ల వ్యక్తిగత డేటా తస్కరణకు గురయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెర్ట్-ఇన్ హెచ్చరించింది.
Android Users-CERT-In | ఇప్పుడు ప్రతి ఒక్కరి వద్ద ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ స్మార్ట్ ఫోన్లే. వాటిల్లో ఎటువంటి లోపాలు ఉన్నా సైబర్ నేరగాళ్ల భారీన పడతారు. ఈ విషయమై ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) హెచ్చరించింది. ఆండ్రాయిడ్ వర్షన్లలో లోపాలు తీవ్రమైనవని.. ఈ లోపాల ఆసరాగా సైబర్ మోసగాళ్లు.. ఆయా ఫోన్లను హ్యాక్ చేసి.. వాటి యూజర్ల సున్నితమైన వ్యక్తిగత డేటా తస్కరించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
ప్రత్యేకించి ఆండ్రాయిడ్-10, 11,12, 12ఎల్, 13 వర్షన్లలో ఈ లోపాలు ఉన్నాయని తాము గుర్తించామని సెర్ట్-ఇన్ తెలిపింది. ఫ్రేమ్ వర్క్, ఆండ్రాయిడ్ రన్ టైం, సిస్టమ్ కాంపొనెంట్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్ డేట్స్, క్వాల్కం క్లోజ్డ్ సోర్స్ కాంపొనెంట్స్‌లో తప్పిదాలతో ఈ సమస్యలు తలెత్తాయని పేర్కొంది.
ఈ తప్పిదాల ఆసరగా సైబర్ మోసగాళ్లు ఆయా ఫోన్లలో యూజర్ల పాస్వర్డ్లు, ఫొటోలు, ఆర్థిక లావాదేవీల డేటా తస్కరించవచ్చునని సెర్ట్ ఇన్ హెచ్చరించింది. ఈ లోపాల నుంచి ఫోన్లను సురక్షితంగా కాపాడుకునేందుకు అనునిత్యం యూజర్లు తమ ఫోన్ల సెక్యూరిటీ ప్యాచ్ అప్ డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ హితవు చెప్పింది. డివైజ్ సెట్టింగ్స్‌లో సిస్టమ్ ఆప్షన్.. తర్వాత సిస్టమ్ అప్ డేట్ క్లిక్ చేయాలి. ఏదైనా అప్ డేట్ ఉంటే సెలెక్ట్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ స్పష్టం చేసింది.
ఫోన్లో మాల్వేర్ ఉందా.. అనే విషయమై తేల్చుకోవడానికి సెక్యూరిటీ యాప్ వినియోగిస్తుండాలని సెర్ట్-ఇన్ తెలిపింది. ప్రత్యేకించి ఫోన్లకు బలమైన పాస్ వర్డ్ ఏర్పాటు చేసుకోవడంతోపాటు యాప్స్‌లో టు-ఫ్యాక్టర్ అథంటికేషన్ ఉపయోగించాలని సూచించింది. భారత్ లోని స్మార్ట్ ఫోన్లలో 95శాతం ఆండ్రాయిడ్ ఆధారంగా పని చేస్తున్నవే. కనుక లక్షల స్మార్ట్ ఫోన్లు, వాటిని వాడుతున్న యూజర్ల డేటా ప్రమాదంలో ఉన్నట్లేనని సెర్ట్-ఇన్ స్పష్టం చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

