న్యూఢిల్లీ, అక్టోబర్ 10: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న మిడ్వెస్ట్ లిమిటెడ్ ఈ నెల 15 నుంచి వాటాలను విక్రయిస్తున్నది. షేర్ల ధరల శ్రేణిని రూ.1,014 నుంచి రూ.1,065 లోపు నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా రూ.451 కోట్ల నిధులను సమీకరించాలని యోచిస్తున్నది. ఈ నెల 15న ప్రారంభం కానున్న వాటాల విక్రయం 17న ముగియనున్నదని తెలిపింది. ఈ వాటాల విక్రయం ద్వారా వచ్చే నిధులను భవిష్యత్తు వ్యాపార విస్తరణకు, రుణాలను తీర్చడానికి వినియోగించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం సంస్థకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లలో 16 గ్రానైట్ గనులు ఉన్నాయి.