Windows 10 | విండోస్ 10 (Windows 10) ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న యూజర్లకు అలెర్ట్. ఈ ఏడాది అక్టోబర్ 14 తర్వాత నుంచి మైక్రోసాఫ్ట్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచ్‌లను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇకపై ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించి అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. అయితే, ఇప్పటికప్పుడు యూజర్లు అందరూ భయపడాల్సిన అవసరమేమీ లేదు. సాధారణ ట్రిక్‌తో సంవత్సరం పాటు సెక్యూరిటీ అప్డేట్స్ను పొందే అవకాశం ఉన్నది. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 యూజర్ల కోసం ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ అప్డేట్స్ (Extended Security Update-ESU) పేరుతో ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
ఇప్పటికప్పుడు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌కి మారకుండా, హార్డ్‌వేర్ సపోర్ట్ చేయని యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్‌ను తీసుకు వచ్చింది. వినియోగదారులు ఇందులో వినియోగదారులు సెక్యూరిటీ అప్డేట్స్ను పొందుతారు. అయితే, కొత్త ఫీచర్లు, టెక్ సపోర్ట్ మాత్రం ఉండదు. అయితే, ఈ సేవలను పొందేందుకు యూజర్లు 30 డాలర్లు (రూ.2500) ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. పీసీ బ్యాకప్ చేసి ఉంటే.. మైక్రోసాప్ట్ రివార్డ్ పాయింట్లు ఉంటే ఈ సేవలను మాత్రం ఉచితంగా పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మీరు వాడుతున్న విండోస్ 10 సిస్టమ్ వాడుతున్న అందరికీ మైక్రోసాఫ్ట్ ఉచితంగానే విండోస్ 11 ఉచితంగా ఇన్స్టాల్ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నది. 10 ఓఎస్‌ను కొనసాగించాలనుకునే వారికి ఈఎస్యూ (ESU) తీసుకోవచ్చని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.